Big Stories

Oppo Reno 12 Pro 5G : ఒప్పో రెనో నుంచి న్యూ 5G స్మార్ట్‌ఫోన్.. ఒక్క ఫోన్‌లో ఇన్ని కెమెరాలు ఏంట్రా బాబు!

Oppo Reno 12 Pro 5G : టెక్ దిగ్గజం ఒప్పో చైనా మార్కెట్‌లో Oppo Reno 12 సిరీస్‌ను తీసుకురానుంది. ఇందులో భాగంగా ఒప్పో Reno 12 Pro 5G స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనుంది. ఈ నెలాఖరులో ఇది భారత్‌లో మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. రెనో 12 లైనప్‌కి ఇండోనేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికే కంపెనీ అమోదం పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP సెల్ఫీ కెమెరా, 16GB RAM, పవర్‌ఫుల్ బ్యాటరీని చూడొచ్చు. ఫోన్ పూర్తి సమాచారం తెలుసుకోండి.

- Advertisement -

Oppo రాబోయే స్మార్ట్‌ఫోన్ Reno 12 Pro 5G ఇండోనేషియా SDPPI సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లో మోడల్ నంబర్ CPH2629తో రిజిస్టర్ చేయబడింది.ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలోని BIS, సింగపూర్‌కు చెందిన IMDA యూరప్‌కు చెందిన EEC నుండి కూడా ఆమోదం పొందింది. ఇది ఇతర కనెక్టివిటీ ఫీచర్‌లతో పాటు NFCకి మద్దతు ఇస్తుందని ఈ డేటా ఆధారంగా తెలుస్తోంది.

- Advertisement -

Also Read : పదివేల కన్నా తక్కువ ధరకే బెస్ట్ ఫోన్స్.. ఇటువంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు!

Oppo Reno 12 Pro 5G స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పరిమాణం,ఛార్జింగ్ స్పీడ్‌ను TUV రైన్‌ల్యాండ్ ఇప్పటికే నిర్ధారించింది. దీని ప్రకారం స్మార్ట్‌ఫోన్ 4,880mAhబ్యాటరీ ప్యాక్‌తో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. Reno 12 Pro 5G బ్యాటరీ సాధారణ పరిమాణం 5,000mAh ఉంటుంది.

Reno 12 Pro 5G కెమెరా FV-5 డేటాబేస్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో f/2.0 ఎపర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉందని వెల్లడించింది. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ప్రస్తుతానికి ఇది చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన తర్వాతనే గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశం ఉంది.

Oppo Reno 12 Pro 5G స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ చైనీస్ వేరియంట్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల క్వాడ్-కర్వ్‌డ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో డైమెన్సిటీ 9200 ప్లస్ స్టార్ స్పీడ్ ఎడిషన్ చిప్‌సెట్ ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 16GB RAM+512GB వరకు స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో లాంచ్ కానుంది.

Also Read : ఇదేక్కడి ఆఫర్ రా దేవుడా.. ఫోన్ ధరను ఒక్కసారిగా ఇంత తగ్గిచ్చేస్తారా..!

ఇది IP65 రేటింగ్‌తో వచ్చే అవకాశం ఉంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడుతూ ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో OISతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2x టెలిఫోటోతో 50 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉంటాయి. ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News