Big Stories

Alia Bhatt Deepfake: మరోసారి డీప్‌ఫేక్ బారిన పడిన అలియా భట్.. ఈ సారి ఎలాంటి వీడియో తెలుసా?

Alia Bhatt Face Morphed On Wamiqa Gabbi: ప్రస్తుతం టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. అందులో డీప్ ఫేక్ ఏఐ టెక్నాలజీ ఒకటి. ఈ డీప్ ఫేక్‌కు సినీ సెలబ్రెటీలే ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు. ఇప్పటికే నేషనల్ క్రష్ రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్, రణవీర్ సింగ్, అమీర్ ఖాన్ వంటి స్టార్ నటీ నటులు సైతం ఈ డీప్ ఫేక్ భారిన పడ్డారు.

- Advertisement -

అయితే ఇప్పుడు మరొక స్టార్ హీరోయిన్ డీప్‌ ఫేక్ వీడియో బయటకొచ్చి నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ తాజాగా డీప్ ఫేక్ బారిన పడింది. ఇటీవల నటి వామికా గబ్బి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో చేసి పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ వీడియోలో వామికా గబ్బి ముఖానికి బదులుగా నటి అలియా భట్ ఫేస్‌ను డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

- Advertisement -

ఆ వీడియో ప్రకారం.. నటి అలియా భట్ ఎర్రటి చీరతో మ్యాచింగ్ బోల్డ్ బ్లౌజ్‌తో కనిపించింది. అలాగే మ్యాచింగ్ సన్‌గ్లాస్‌ను కూడా పెట్టుకుని ఉన్నట్లు కనిపించింది. ఆ వీడియోపై క్యాప్షన్.. ‘‘అలియాభట్ ఆఫ్ స్క్రీన్’’ అంటూ రాసి ఉంది. ఈ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు, అభిమానులు రకరకాలు స్పందిస్తున్నారు. అందులో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇది వామికా గాబీ వీడియో.. ఆ వీడియోతో అలియా ఫేస్‌ను మార్ఫింగ్ చేశారు అని రాసుకొచ్చాడు. ఇంకొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Also Read: మొన్న రష్మిక.. నిన్న కత్రినా .. నేడు ఆలియా.. డీప్ ఫేక్ వీడియోస్ కలకలం ..

అయితే అలియా భట్‌కు ఇలా జరగడం మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. అందులో ఓ చిన్న టాప్ అండ్ షార్ట్ వేసుకుని బోల్డ్‌గా కనిపించింది. అప్పట్లో ఆ వీడియో తెగ చక్కర్లు కొట్టింది. అది మొదటిగా చూసి అంతా నిజమే అని.. ఆ వీడియోలో ఉన్నది అలియా భట్ అనే అనుకున్నారు. కానీ ఇదంతా డీప్ ఫేక్ వ్యవహారమని తెలిసి అవాక్కయ్యారు. ఇప్పుడు మరోసారి అలియా డీప్ ఫేక్‌తో ఇలా దర్శనమిచ్చింది.

ఇకపోతే అలియా తాజాగా జరిగిన మెట్ గాలా 2024 ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమెరికాలోని న్యూయర్క్‌లోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఈ ఈవెంట్ జరిగింది. ఇందులో అలియా తన అందం, డ్రెస్సింగ్‌తో స్పషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. షిమ్మరీ శారీలో కనిపించిన అలియా తన స్మైల్‌తో అందరినీ కట్టిపడేసింది. అయితే ఆమె ధరించిన ఆ చీరను తయారు చేయడానికి దాదాపు 163 మంది డిజైనర్లు కష్టపడ్డారు. అంతేకాదు ఏకంగా 1965 గంటల సమయాన్ని ఆ చీర తయారీకి కేటాయించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News