E-Paper
Advertisement

రూ.17,490కే బ్రాండెడ్ డిష్‌వాషర్..ఇక మీ కిచెన్ కష్టాలకు ఫుల్ స్టాప్

రూ.17,490కే బ్రాండెడ్ డిష్‌వాషర్..ఇక మీ కిచెన్ కష్టాలకు ఫుల్ స్టాప్
Advertisement

Voltas Beko DT8S: ఈ మధ్య కాలంలో సిటీ లైఫ్ ఎంత స్పీడ్‌గా మారిపోయిందో మనందరికీ తెలిసిందే. ఉదయం ఆఫీస్‌కు పరుగులు, సాయంత్రం ఇంటి పనులు,మధ్యలో కిచెన్‌లో వంటావార్పు.. ఇలా రోజు గడిచిపోతోంది. ఇన్ని పనుల మధ్య గిన్నెలు తోమడానికి గంటల తరబడి టైమ్ కేటాయించడం కష్టంగా మారింది. అప్పుడప్పుడు పనిమనిషి సెలవు పెడితే ఇంకాస్త టెన్షన్ పెరుగుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది ఇళ్లలో డిష్‌ వాషర్‌లను ఒక లగ్జరీలా కాకుండా, డైలీ లైఫ్‌ను సింపుల్ చేసే స్మార్ట్ గాడ్జెట్‌లా చూస్తున్నారు. ఈ క్రమంలో రూ.17,490 ధరకు లభిస్తున్న ఈ మోడల్ ప్రస్తుతం ట్రెండింగ్‌గా నిలుస్తోంది.

పూర్తి వివరాలు:

మన ఇండియన్ కిచెన్లలో నూనె, నెయ్యి, పసుపు, మసాలాల మరకలు గిన్నెలకు గట్టిగానే పట్టుకుంటాయి. చేత్తో తోమాలంటే చేతులు నొప్పి పుడతాయి, టైమ్ కూడా ఎక్కువే పడుతుంది. ఈ డిష్‌వాషర్‌లో ఉండే 6 వాష్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా 70°C ఇంటెన్సివ్ వాష్ ఆప్షన్ గిన్నెలపై ఉండే జిడ్డును, మరకలను ఈజీగా వదిలించడానికి ఉపయోగ పడుతుంది. గాజు గ్లాసులు, కప్పులు, ప్లేట్లు కూడా కొత్త వాటిలా మెరిసేలా క్లీన్ చేయడానికి ఇందులో ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి.

Advertisement

ఇక కెపాసిటీ విషయానికి వస్తే.. ఇది 8 ప్లేస్ సెట్టింగ్స్‌తో వస్తుంది. అంటే చిన్న కుటుంబాలకు లేదా బ్యాచిలర్స్, కొత్తగా పెళ్లైన జంటలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజువారీ ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు, స్పూన్లను ఒకే సారి ఇందులో సర్ది వాష్ చేసుకోవచ్చు. సైజు కూడా కాంపాక్ట్‌గా ఉండటం.. వల్ల కిచెన్ కౌంటర్‌ టాప్ మీద లేదా ఫ్రీ స్టాండింగ్‌గా ఎక్కడైనా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. అద్దె ఇళ్లలో ఉండే వారికి కూడా ఇది పెద్ద బరువు అనిపించదు, మూవ్ చేయడం తేలికగానే ఉంటుంది.

మనకు చాలా మందికి వచ్చే మరో డౌట్.. డిష్‌ వాషర్ వాడితే.. నీళ్లు ఎక్కువ ఖర్చవుతాయా? కరెంట్ బిల్లు పెరుగుతుందా? అని. నిజానికి చేత్తో గిన్నెలు తోమేటప్పుడు ట్యాప్ తిప్పి చాలా నీళ్లు వృథా చేస్తాం. కానీ ఈ మోడల్ ఒక్క సైకిల్‌కు సుమారు 8 లీటర్ల నీటిని మాత్రమే వాడుకుంటుంది. నీటి సమస్య ఉండే ప్రాంతాల్లో ఇది నిజంగా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అలాగే ఇందులో.. పవర్ కన్జంప్షన్ కూడా తక్కువగానే ఉంటుంది. సౌండ్ కూడా మిక్సీ లేదా గ్రైండర్ అంత పెద్దగా కాకుండా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.

Advertisement

రూ.17,490 ధర అంటే.. ఈ డిష్‌వాషర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గానే కనిపిస్తుంది. ఆన్‌లైన్ ఆఫర్లు, సేల్స్ టైమ్‌లో ధరల్లో కొద్ది మార్పులు ఉంటాయి. వారంటీ పరంగా చూస్తే, ప్రొడక్ట్‌పై 2 ఏళ్ల కాంప్రహెన్సివ్ వారంటీతో పాటు మోటార్‌పై అదనంగా 3 ఏళ్ల వారంటీ (మొత్తం 5 ఏళ్ల మోటార్ వారంటీ) లభిస్తుంది. ఇండియన్ మార్కెట్‌లో వోల్టాస్ బెకో సర్వీస్ నెట్‌వర్క్ ఉండటం వల్ల సపోర్ట్ విషయంలోనూ కొంత భరోసా ఉంటుంది.

Also Read: రూ.8,299కే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

జాగ్రత్తలు:

అయితే ఏ గాడ్జెట్ అయినా కొనే ముందు దాని పరిమితులు కూడా తెలుసుకోవాలి. ఇది 8 ప్లేస్ సెట్టింగ్స్ మోడల్ కాబట్టి, పెద్ద జాయింట్ ఫ్యామిలీ అయితే.. రోజుకు రెండుసార్లు రన్ చేయాల్సి రావచ్చు. అలాగే.. చాలా పెద్ద కడాయిలు, ప్రెజర్ కుక్కర్లు ఇందులో ఇరికించడం కొంచెం కష్టమే. అల్యూమినియం గిన్నెలను డిష్‌ వాషర్‌లో వేయకపోవడమే మంచిది, గిన్నెలు పెట్టే ముందు పెద్దగా ఉన్న ఆహార వ్యర్థాలను దులిపి లేదా కడిగి పెడితే రిజల్ట్ ఇంకా బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే, మీ ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఉండి, రోజూ గిన్నెలు తోమే శ్రమ తగ్గాలని అనుకుంటే రూ.17,490 ధరలో ఈ డిష్‌వాషర్ ఒక మంచి స్మార్ట్ ఛాయిస్. టైమ్ ఆదా అవ్వడంతో పాటు కిచెన్ పని కొంచెం బెటర్ గా మారుతుంది.

Related News

ఎయిర్‌టెల్ ‘ఇన్‌సైడర్’ ప్రోగ్రామ్.. యూజర్లకు రూ.30,000కు పైగా బెనిఫిట్స్.. ఎలా పొందాలంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులపై మెటా కొరడా.. అల్గారిథమ్‌లో భారీ మార్పులు!

సైబర్ నేరగాళ్ల కొత్త అస్త్రం SIM Swap.. ఓటీపీ చెప్పకపోయినా మీ అకౌంట్ జీరో అవుతుంది! జాగ్రత్త పడండిలా..

రూ.15 వేలలోపే ఇంటిని మినీ థియేటర్‌గా మార్చేసే 4 బెస్ట్ సౌండ్‌బార్స్ ఇవే!

బర్త్ డే విషెస్ కోసం రాత్రి 12 గంటలకు నిద్రలేవాల్సిన పనే లేదు..వాట్సాప్ మెసేజ్‌ షెడ్యూల్ చేయండిలా!

రూ.8,299కే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

సామాన్యుల రీఛార్జ్ భారం తగ్గిస్తున్న BSNL.. రూ.172కే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు!

Big Stories

Advertisement
×