E-Paper
Advertisement

ఒంటరి జీవితాల్లో కొత్త వెలుగులు… వయసుతో సంబంధం లేని స్వచ్ఛమైన బంధం… ఎమోషనల్ మలయాళం మూవీ

ఒంటరి జీవితాల్లో కొత్త వెలుగులు… వయసుతో సంబంధం లేని స్వచ్ఛమైన బంధం… ఎమోషనల్ మలయాళం మూవీ
Advertisement

Malayalam Family Drama on OTT: ఇటీవల ఓటీటీలో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో థియేటర్లలో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మలయాళ చిత్రం ‘మధురమీ జీవితం’ (Madhuramee Jeevitham) ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సీనియర్ నటులు సిద్ధిక్, వినయ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, రిలీజ్ అయినప్పటి నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. జీవిత చరమాంకంలో ఒంటరితనాన్ని జయించడానికి తోడు కోరుకునే ఇద్దరు వ్యక్తుల ప్రయాణమే ఈ సినిమా ప్రధాన ఆకర్షణ. ఈ హార్ట్ టచింగ్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం.

కథ ఏమిటంటే ?

70 ఏళ్ల చందు మీనన్ (సిద్దిక్) తన కొడుకు, కోడలితో కలిసి నివసిస్తుంటాడు. భార్యను కోల్పోయిన అతను, తన వయసు వల్ల ఎదురయ్యే ఒంటరితనాన్ని భరిస్తూ రోజులు గడుపుతుంటాడు. మరోవైపు 65 ఏళ్ల మాధవి కుట్టి (వినయ ప్రసాద్) కూడా భర్తను కోల్పోయి, ఒక ఫ్లాట్‌లో ఒంటరిగా జీవిస్తుంటుంది. వీరిద్దరూ అనుకోకుండా ఒకసారి కలుసుకుంటారు. ఆ పరిచయం నెమ్మదిగా మంచి స్నేహంగా మారుతుంది. ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టిన తర్వాత, వారి మధ్య ఉన్న స్నేహం కాస్తా ప్రేమగా, ఒకరికొకరు తోడుగా ఉండాలనే బలమైన బంధంగా మారుతుంది.

Advertisement

ఈ వయసులో తోడు కోరుకోవడంపై కుటుంబం నుండి, సమాజం నుండి కొన్ని అభ్యంతరాలు, సవాళ్లు ఎదురైనప్పటికీ, అవన్నీ పక్కన పెట్టి కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని వీరిద్దరూ నిర్ణయించుకుంటారు. అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న సమయంలో, ఒక ఊహించని ప్రమాదం చందు మీనన్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ కష్ట సమయంలో మాధవి అతనికి అండగా నిలబడి, కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఏ వయసులోనైనా నిజమైన ప్రేమ, తోడు జీవితానికి ఎంతటి కొత్త అర్థాన్ని, ఆనందాన్ని ఇస్తాయో ఈ సినిమా చాలా ఎమోషనల్ గా చూపిస్తుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే ?

ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో మలయాళ సీనియర్ నటులు సిద్ధిక్ (చందు మీనన్), వినయ ప్రసాద్ (మాధవి కుట్టి) ప్రధాన పాత్రల్లో నటించగా, జానీ ఆంటోనీ, పూజిత మీనన్, గాయత్రి సురేష్, ప్రియాంక నాయర్ మరియు ఇర్షాద్ అలీ కీలక పాత్రలు పోషించారు. మాథ్యూ స్కారియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. థియేటర్లలో సెప్టెంబర్ 2026 న విడుదలై మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా 2026 నవంబర్ 13 నుండి Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇది ఒరిజినల్ మలయాళ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇంకా విడుదల కాలేదు.

Advertisement

Read Also: పదేళ్ల భర్త చిత్రహింసలకు ఎండ్ కార్డ్… ఫస్ట్ లవ్‌తో సెకండ్ ఇన్నింగ్స్… హృదయాన్ని కదిలించే సినిమా

Related News

భర్తకు పిల్లలు పుట్టరని తెలిసినా భార్య ప్రెగ్నెంట్.. మాజీ భార్య ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… ఓటీటీలో అస్సలు మిస్ కావద్దు

చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న మాఫియా డాన్… దేశాన్నే గడగడలాడించిన రక్తచరిత్ర

పులివేషాల సంస్కృతి మాటున ప్రతీకార జ్వాలలు… ఓటీటీలోకి సంచలనం సృష్టించిన యాక్షన్ థ్రిల్లర్

ప్రపంచాన్ని మారుస్తామని 8 బిలియన్ డాలర్ల కుంభకోణం.. ఇది చిన్న కథ కాదు భయ్యా

ఆన్‌లైన్‌లో అజ్ఞాత ప్రేమికుడు… కట్ చేస్తే కాలేజీ సూపర్ స్టార్… ఓటీటీలో ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ కామెడీ

తండ్రీకొడుకుల మధ్య ప్రాంక్ వార్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన అసలు దొంగలు.. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్

మాయా లోకంలో మహా సంగ్రామం… శాపాన్ని ఛేదించడానికి యోధుల సాహస యాత్ర… ఫాంటసీ ప్రియులకు అసలైన విందు

Big Stories

Advertisement
×