Philips tax2504 party speaker: ప్రస్తుత కాలంలో పార్టీ లేదా ఫంక్షన్.. ఏదైనా మ్యూజిక్ లేకపోతే అసంపూర్ణంగానే ఉంటుంది. పుట్టిన రోజు వేడుకలైనా, ఫ్యామిలీ గెట్-టు-గెదర్ అయినా దానికి తగ్గ బేస్, క్లియర్ ఆడియో ఉంటేనే అసలైన జోష్ వస్తుంది. ఈ అవసరాలను పూర్తిగా తీర్చడానికి ఫిలిప్స్ బ్రాండ్ నుంచి వచ్చిన లేటెస్ట్ పార్టీ స్పీకర్ మార్కెట్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తక్కువ బడ్జెట్‌లో.. బెస్ట్ స్పీకర్ ఫీల్ కోరుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ స్పీకర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్పీకర్ అతిపెద్ద ప్రత్యేకత దాని ఆడియో పవర్ అని చెప్పొచ్చు. ఇందులో 8 ఇంచుల పెద్ద వూఫర్‌ను వాడారు. ఇది రూమ్ మొత్తాన్ని హోరెత్తించేలా బేస్‌ను అందిస్తుంది. అలాగే దీనిలో 80W మాక్స్ అవుట్‌పుట్ ఉండటం వల్ల పాటల్లోని.. ప్రతి బీట్ చాలా స్పష్టంగా,పవర్ ఫుల్‌గా వినిపిస్తుంది. ఓపెన్ ప్లేస్‌లో లేదా పెద్ద హాల్స్‌లో జరిగే చిన్న పార్టీలకు కూడా ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.
పాటలు పడటం ఇష్ట పడే వారికి, కారావోకే లవర్స్ ఈ స్పీకర్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ స్పీకర్‌తో పాటు ఒక వైర్‌లెస్ మైక్రోఫోన్ కూడా ఉచితంగా వస్తుంది.ఇంట్లోనే మినీ కారావోకే నైట్‌ను ఎంజాయ్ చేయడానికి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగ పడుతుంది.
లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన.. కనెక్షన్ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇది లేటెస్ట్ బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పని చేస్తుంది. దీని వల్ల మీ స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను క్షణాల్లో కనెక్ట్ చేసుకోవచ్చు.కనెక్షన్ మధ్యలో కట్ అయ్యే సమస్యే ఉండదు. అలాగే TWS పేరింగ్ సపోర్ట్ ఉండటం వల్ల మరో స్పీకర్‌ను యాడ్ చేసి సౌండ్ పవర్‌ను పెంచుకోవచ్చు. ఇవి కాకుండా USB, AUX పోర్ట్‌లు కూడా దీనిలో అందుబాటులో ఉన్నాయి.
పార్టీ మూడ్‌ను మరింత ఉత్సాహంగా మార్చడానికి కలర్‌ఫుల్ లైట్లు ఎంతగానో సహాయ పడతాయి. ఇందులో ఆకట్టుకునే డైనమిక్ ఆర్జీబీ లైట్లు ఉంటాయి. మ్యూజిక్ బీట్స్‌కు తగినట్లుగా .. ఈ లైట్లు మారుతూ పార్టీకి సరి కొత్త లుక్‌ను తెస్తాయి. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. దీనిని ఒక సారి ఫుల్ చార్జ్ చేస్తే సుమారు 6 గంటల వరకు నాన్‌స్టాప్ ఎంటర్ టైన్మెంట్ పొందొచ్చు.
Also Read: అలర్జీలు,దుమ్ముకు చెక్ పెట్టే..హానివెల్ ఎయిర్ ప్యూరిఫైయర్
అన్ని ప్రీమియం ఫీచర్లు కలిగిన..ఈ ఫిలిప్స్ పార్టీ స్పీకర్ ధర చాలా రీజనబుల్‌గా ఉంది. మార్కెట్లో దీని ధర సుమారు రూ.6,999 వరకు ఉంది.ఈ బడ్జెట్‌లో వైర్‌లెస్ మైక్ , 80 వాట్ల పవర్ లభించడం నిజంగా గ్రేట్ డీల్ అనే చెప్పాలి.
మొత్తానికి.. తక్కువ బడ్జెట్‌లో హై-క్వాలిటీ సౌండ్, డిజె లైట్లు, మైక్ సపోర్ట్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ పార్టీ స్పీకర్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ వీకెండ్‌లో మీ పార్టీల జోరును మరింత పెంచడానికి ఈ ట్రెండీ స్పీకర్‌ను మీ ఇంటికి తెచ్చుకోండి!