E-Paper
Advertisement

ఈవెనింగ్ స్నాక్ కోసం ఈ చికెన్ పెరి పెరి పాపర్స్ ట్రై చేయండి.. ఇంటిల్లిపాదీ శభాష్ అంటారు!

ఈవెనింగ్ స్నాక్ కోసం ఈ చికెన్ పెరి పెరి పాపర్స్ ట్రై చేయండి.. ఇంటిల్లిపాదీ శభాష్ అంటారు!
Advertisement

Chicken Peri Peri Poppers: వీకెండ్ వచ్చిందంటే ఇంట్లో పిల్లలకు, ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్‌కు ఏదైనా స్పెషల్ స్నాక్ చేసి పెట్టాలనిపిస్తుందా? ఎప్పుడూ చేసే చికెన్ ఫ్రై, పకోడీలకు బదులుగా ఈసారి కాస్త డిఫరెంట్‌గా ‘చికెన్ పెరి పెరి పాపర్స్’ ట్రై చేయండి. బయట రెస్టారెంట్లలో దొరికే స్టైల్‌లోనే ఇంట్లో కూడా వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. చికెన్ ముక్కలకు మసాలాలు పట్టించి, బయట కరకరలాడేలా వేయిస్తే చాలు.. నోరూరించే చికెన్ పాపర్స్ సిద్ధమైపోతాయి.

ముఖ్యంగా పెరి పెరి మసాలా ఇచ్చే స్పైసీ రుచి ఈ స్నాక్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తుంది. సాయంత్రం వేళ వేడివేడి టీ లేదా కాఫీతో వీటిని తింటే ఆ రుచే వేరు. రెస్టారెంట్లలో ఆర్డర్ చేయకుండానే, ఇంట్లో ఉన్న పదార్థాలతో తక్కువ ఖర్చుతో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే చికెన్ పెరి పెరి పాపర్స్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా..

కావాల్సిన పదార్థాలు:

Advertisement

బోన్‌లెస్ చికెన్ – అర కేజీ
పెరి పెరి పౌడర్ – రెండు టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక చెంచా
నిమ్మరసం – ఒక చెంచా
పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు
మైదా పిండి – అర కప్పు
కార్న్ ఫ్లోర్ – మూడు టేబుల్ స్పూన్లు
గుడ్డు – ఒకటి
బ్రెడ్ క్రమ్స్ – ఒక కప్పు
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి సరిపడా
మిరియాల పొడి – అర చెంచా

Also Read: స్వీట్ షాప్ టేస్ట్ గ్యారెంటీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోదగ్గ నెల్లూరు మలైకాజా రెసిపీ!

తయారీ విధానం:

Advertisement

బోన్‌లెస్ చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా సమానంగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పెరుగు, పెరి పెరి పౌడర్, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం అరగంట పాటు ఫ్రిజ్‌లో నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు చికెన్ ముక్కలకి బాగా పట్టి లోపలి వరకు మంచి రుచి వస్తుంది.

ఇప్పుడు మరొక వెడల్పుపాటి గిన్నెలో మైదా పిండి, కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. మరో గిన్నెలో గుడ్డును పగలకొట్టి బాగా గిలకొట్టాలి. అలాగే ఇంకో ప్లేట్‌లో బ్రెడ్ క్రమ్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా పట్టించి పెట్టుకున్న చికెన్ ముక్కను తీసుకుని ముందుగా మైదా మిశ్రమంలో దట్టించాలి. ఆ తర్వాత గిలకొట్టిన గుడ్డు మిశ్రమంలో ముంచి, చివరగా బ్రెడ్ క్రమ్స్‌తో అన్ని వైపులా బాగా కోట్ చేయాలి. ఇలా అన్ని చికెన్ ముక్కలను సిద్ధం చేసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె మరీ ఎక్కువగా కాకుండా మధ్యమంగా కాగేలా చూసుకోవాలి. మనం సిద్ధం చేసుకున్న చికెన్ పాపర్స్‌ని ఒక్కొక్కటిగా నూనెలో వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. ఇవి గోధుమ రంగులోకి మారి పైభాగం మంచి క్రిస్పీగా అయ్యే వరకు సుమారు 5 – 7 నిమిషాల పాటు వేయించాలి.

ఇలా వేగిన పాపర్స్‌ని ఆయిల్ పీల్చుకునే పేపర్ నాప్‌కిన్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన, కరకరలాడే చికెన్ పెరి పెరి పాపర్స్ సిద్ధం. వీటిని టొమాటో సాస్ లేదా మయోన్నైస్‌తో వేడి వేడిగా సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ వీకెండ్ మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి అందరితో శభాష్ అనిపించుకోండి మరి.

Also Read: సీక్రెట్ మసాలాలతో తందూరీ మోమోస్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసేయొచ్చు!

Tags

Related News

క్యాప్సికమ్‌లో మటన్ ఖీమా స్టఫింగ్.. ఈ వెరైటీ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా?

స్వీట్ షాప్ టేస్ట్ గ్యారెంటీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోదగ్గ నెల్లూరు మలైకాజా రెసిపీ!

మీ పర్సు రంగు ఇదేనా? వాస్తు ప్రకారం డబ్బు నిలవాలంటే ఈ రంగులే బెస్ట్!

డేటింగ్ యాప్స్‌లో చాట్‌ఫిషింగ్ కలకలం.. రొమాంటిక్ మెసేజ్‌లతో మాయాజాలం

పాలు,పంచదార ఉంటే చాలు..ఇంట్లోనే దూది లాంటి రసగుల్లా రెడీ!

ఎప్పుడూ చేసుకునే దొండకాయ ఫ్రై బోర్ కొట్టిందా?ఈసారి ఇలా ట్రై చేయండి

గోధుమపిండితో చల్ల పునుగులు..మైదా లేకుండానే బెస్ట్ టేస్ట్

Big Stories

Advertisement
×