Mamatha Sri: ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ హడావుడి నడుస్తోంది. అయితే.. చిత్తూరు జిల్లా గుడిపాల TDP జడ్పీటీసీ అభ్యర్థి మమతశ్రీ ఇప్పుడు టాక్ ఆఫ్ ఏపీగా మారిపోయారు. ఈసీ అధికారులకు ఆమె చూపించిన ఆస్తుల వివరాలు సెన్సేషన్‌గా మారాయి. మమతశ్రీ తన ఆస్తులను 172 కోట్లకు పైగానే ఉన్నట్టు వివరాలతో సహా చూపించడం ఆసక్తికరంగా మారింది. మమతశ్రీ భర్త పేరిట 122 కోట్లు, ఆమె పేరిట 49 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఆఫిడవిట్‌లో వివరించారు.
జెడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ. 172 కోట్లు!
ఈ ఆస్తులు వ్యవసాయ భూములు, నివాస, వాణిజ్య భవనాలు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు రూపంలో చూపించారామె. అయితే.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులే వందల కోట్ల రూపాయల్లో ఆస్తులు చూపిస్తూ ఉంటారు. వాళ్లలో కూడా అందరికీ ఇంత మొత్తంలో ఉండకపోవచ్చు. కొంతమంది లక్షల రూపాయల లెక్కలు చెప్పేవారు కూడా ఉన్నారు. అలాంటిది ఓ జెడ్పీటీసీ అభ్యర్థి.. అంటే జస్ట్ ఓ మండల స్థాయి నేత 172 కోట్ల రూపాయలు ఆస్తుల లెక్క చెప్పడం ఇప్పుడు ఇంట్రస్టింగ్ మారింది.
మమతశ్రీ చుట్టూ మరో ఇంట్రస్టింగ్ డిస్కషన్
మమతశ్రీ చుట్టూ మరో ఇంట్రస్టింగ్ డిస్కషన్ కూడా నడుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నవారు అసెంబ్లీకో.. పార్లమెంట్ కో వెళ్లడానికి ఆసక్తిచూపిస్తూ ఉంటారు. కానీ, ఆమె పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడం ఇంట్రస్టింగ్‌గా మారింది. అంటే ఆమెకు రాజకీయాలపై ఉన్న ఇంట్రస్టే కారణమా? లేకపోతే ఆర్థికంగా బలమైన నేతను బరిలోకి దించాలని పార్టీ భావించిందా? ఇలాంటి క్వశ్చన్స్, డిస్కషన్స్ నడుస్తున్నాయి.
Also Read: ఏడాది తర్వాత వీడిన ఖమ్మం మర్డర్ మిస్టరీ.. చెప్పుల క్లూతో చిక్కిన కిల్లర్స్!