Parineeti Chopra -Raghav Chadha: ఉత్తరాది రాష్ట్రాలలో కర్వా చౌత్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇకపోతే ఈ ఏడాది కూడా బాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఈ కర్వా చౌత్ పర్వదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కర్వా చౌత్(Karwa Chauth) వేడుకలను నటి పరిమితి చోప్రా(Parineeti Chopra) తన భర్త రాఘవ్ చద్దా(Raghav Chadda)తో కలిసి విభిన్నంగా జరుపుకున్నారు. తాజాగా ఈ దంపతులు తమ కర్వా చౌత్ వేడుకలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
సాధారణంగా కంటే కూడా పరిణితి చోప్రా ఎంతో విభిన్నంగా కర్వా చౌత్ వేడుకలను జరుపుకున్నారు. 35 వేల అడుగుల ఎత్తులో విమానంలో ప్రయాణిస్తూ ఈ వేడుకను జరుపుకోవడం గమనార్హం. ఇలా విమానంలో ప్రయాణిస్తూ తన ఉపవాసాన్ని విడిచి ఈమె కర్వా చౌత్ జరుపుకున్నారు. ఈ వీడియోని పరిణితి చోప్రా షేర్ చేస్తూ..కర్వా చౌత్ ఎక్కడున్నా, అది మనం 35,000 వేల అడుగుల ఎత్తులో ఉన్నా.. నా కలలన్నింటినీ సాకారం చేశావు రాగజీ అంటూ ఈమె ఈ వేడుకను జరుపుకోవడం గురించి తెలియజేశారు. ఇకపోతే వీరిద్దరూ విమానంలో ఇలా కర్వా చౌత్ వేడుకను జరుపుకోవడానికి కారణం లేకపోలేదు.
పరిణితి చోప్రా ప్లాన్ ప్రకారం ఇంట్లోనే కర్వా చౌత్ వేడుకలను జరుపుకోవాలని ఉండగా తమ ఫ్లైట్ ఆలస్యం అవ్వడంతో ఇలా విమానంలోనే ఈ వేడుకను జరుపుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ కిటికీ ద్వారా ఈమె చంద్రుని చూసి అనంతరం తన భర్త రాఘవ చద్దాను చూసిన తర్వాత ఈమె తన ఉపవాసాన్ని విడిచారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో ఎక్కడ ఉన్నా సాంప్రదాయాలను ఎంతో గౌరవంగా పాటిస్తున్నారు అంటూ ఈ జంటపై పెద్ద ఎత్తున అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
?exln=MWdya2ltMjRmaXR1NQ%3D%3D
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న పరిణితి చోప్రా రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దాను 2023వ డిసెంబర్ 24న రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. ఇక ఈ దంపతులకు గత ఏడాది బాబు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారికి ‘నీర్’ అని నామకరణం చేశారు. ఇక పెళ్లి తర్వాత పరిణితి చోప్రా సినిమాలకు కూడా కాస్త విరామం ప్రకటించారు. ఇలా కెరియర్ పరంగా పరిణితి పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా సోషల్ మీడియా వేదికగా నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
Also Read: సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..డెలివరీ డేట్ ఎప్పుడో చెప్పేసిన సామ్ ఫ్రెండ్!