E-Paper
Advertisement

డేటింగ్ యాప్స్‌లో చాట్‌ఫిషింగ్ కలకలం.. రొమాంటిక్ మెసేజ్‌లతో మాయాజాలం

డేటింగ్ యాప్స్‌లో చాట్‌ఫిషింగ్ కలకలం.. రొమాంటిక్ మెసేజ్‌లతో మాయాజాలం
Advertisement

Chatfishing| మీకు ఎవరైనా ఎంతో అందంగా, రొమాంటిక్‌గా మెసేజ్‌లు పంపుతున్నారా? వారి మాటలు చూస్తుంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తిలా అనిపిస్తోందా? అయితే ఒక్కసారి ఆలోచించండి! ఆ మెసేజ్‌లు నిజంగా వారు రాస్తున్నవేనా? లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రాయిస్తున్నారా? ప్రస్తుతం ఆన్‌లైన్ డేటింగ్ ప్రపంచంలో ఇలాంటి కొత్త ట్రెండ్ చర్చనీయాంశంగా మారింది. దీన్నే చాట్‌ఫిషింగ్ (Chatfishing) అని అంటున్నారు. అసలు ఈ ట్రెండ్ ఏంటి? ఇది సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తెలుసుకుందాం.

అసలు చాట్‌ఫిషింగ్ అంటే ఏమిటి?

ఆన్‌లైన్ డేటింగ్ లేదా పర్సనల్ మెసేజెస్‌లో ఏఐతో మెసేజ్‌లు తయారు చేయించడాన్ని చాట్‌ఫిషింగ్ అంటారు. ఇందులో వ్యక్తులు స్వయంగా సమాధానాలు రాయడానికి బదులుగా ఏఐ టూల్స్‌ ఉపయోగిస్తారు. ఉదాహరణకు.. డేటింగ్ యాప్‌లో ఎదుటివారు పంపిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను చాట్ జీపిటి, గూగుల్ జెమిని లాంటి AI టూల్‌కు పంపిస్తారు. ఆ మెసేజ్‌కు సరిపోయే సమాధానాన్ని ఏఐ తయారు చేస్తుంది. దాన్ని కాపీ చేసి ఎదుటివారికి సెండ్ చేస్తారు. ఇలా తయారైన మెసేజ్‌లు ఎంతో ఆకర్షణీయంగా, రొమాంటిక్‌గా, తెలివిగా కనిపిస్తాయి. దీంతో ఎదుటివారిపై మంచి అభిప్రాయం కలిగించవచ్చు. అయితే, ఆ మాటలు తమ నిజమైన ఆలోచనలని ఎదుటివారు నమ్మితే సమస్యలు మొదలవుతాయి.

క్యాట్ ఫిషింగ్, చాట్ ఫిషింగ్.. ఈ రెండు పదాల మధ్య తేడా ఏంటి?

Advertisement

ఈ రెండు పదాలు ఒకేలా అనిపించినా వాటి అర్థాలు వేర్వేరు. క్యాట్ ఫిషింగ్‌లో వ్యక్తులు తమ నిజమైన గుర్తింపును దాచిపెడతారు. నకిలీ ఫొటోలు, తప్పుడు వివరాలు లేదా ఇతరుల పేర్లతో ఆన్‌లైన్‌లో పరిచయాలు పెంచుకుంటారు. కానీ చాట్‌ఫిషింగ్‌లో వ్యక్తులు తమ నిజమైన గుర్తింపును దాచాల్సిన అవసరం లేదు. కేవలం మెసేజ్‌లు రాయడానికి AI సహాయం తీసుకుంటారు. అంటే క్యాట్‌ఫిషింగ్‌లో తప్పుడు గుర్తింపు ప్రధాన సమస్య. చాట్‌ఫిషింగ్‌లో AIతో తయారైన మెసేజ్‌లు సంభాషణలు ప్రధాన అంశం.

AI మెసేజ్‌లు ఎప్పుడు సమస్యగా మారుతాయి?

మెసేజ్‌లను మెరుగుపరచడానికి లేదా సరైన పదాలు ఎంచుకోవడానికి AI సహాయం తీసుకోవడం తప్పు కాదు. కానీ ప్రతి సమాధానానికి AIపై ఆధారపడటం సమస్యలకు దారితీయవచ్చు. ఎందుకంటే ఎదుటివారు ఆ మెసేజ్‌ల ఆధారంగా ఒక వ్యక్తిత్వాన్ని ఊహించుకుంటారు. కానీ ప్రత్యక్షంగా కలిసినప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తన భిన్నంగా ఉండవచ్చు. ఫోన్ కాల్స్ లేదా ముఖాముఖి సంభాషణల్లో ఈ తేడా బయటపడుతుంది. దీంతో సంబంధాల్లో అపార్థాలు, నమ్మక సమస్యలు ఏర్పడవచ్చు.

Advertisement

Also Read: తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా? ఈ 5 కలలకు అర్థాలు ఇవే

చాట్‌ఫిషింగ్‌ ఎలా గుర్తించాలి?

కొన్ని లక్షణాలు గమనించడం ద్వారా అది ఏఐ మెసేజ్ అని గుర్తించవచ్చు. ప్రతి మెసేజ్ చాలా పద్ధతిగా, అందంగా ఉండటం. సందర్భానికి మించి రొమాంటిక్‌గా సమాధానాలు ఇవ్వడం. ప్రత్యక్ష సంభాషణలో అదే స్థాయిలో మాట్లాడలేకపోవడం. ఫోన్ కాల్స్‌లో తమ ఆలోచనలను సరిగ్గా వ్యక్తపరచలేకపోవడం. ఎదుటివారి ప్రశ్నలకు సంబంధం లేని సమాధానాలు ఇవ్వడం. అయితే, ఇవి చాట్‌ఫిషింగ్‌కు కచ్చితమైన ఆధారాలు కావు. కొందరు సహజంగానే చక్కగా మెసేజ్‌లు రాయగలరు.

Also Read: మీ పిల్లలు టపాసుల శబ్దాలకు భయపడుతున్నారా? దీపావళి వేళ తల్లిదండ్రులకు 5 చిట్కాలు

డేటింగ్‌లో నిజమైన సంభాషణ ముఖ్యం

ఆన్‌లైన్ మెసేజ్‌లు పరిచయాలను పెంచవచ్చు. కానీ నిజమైన సంబంధాలకు నమ్మకం, నిజాయితీ, పరస్పర అవగాహన అవసరం. ప్రత్యక్షంగా కలవడం, ఫోన్‌లో మాట్లాడటం ద్వారా ఎదుటివారి అసలు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. కేవలం అందమైన మెసేజ్‌లను చూసి ఒకరిపై అభిప్రాయం ఏర్పరచుకోకూడదు. AI మంచి సందేశాలు తయారు చేయగలదు. కానీ నిజమైన భావాలను, వ్యక్తిగత అనుబంధాన్ని భర్తీ చేయలేదు. అందుకే డేటింగ్‌లో ఆకర్షణీయమైన మెసేజ్‌ల కంటే నిజాయితీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.

Related News

ఈవెనింగ్ స్నాక్ కోసం ఈ చికెన్ పెరి పెరి పాపర్స్ ట్రై చేయండి.. ఇంటిల్లిపాదీ శభాష్ అంటారు!

స్వీట్ షాప్ టేస్ట్ గ్యారెంటీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోదగ్గ నెల్లూరు మలైకాజా రెసిపీ!

మీ పర్సు రంగు ఇదేనా? వాస్తు ప్రకారం డబ్బు నిలవాలంటే ఈ రంగులే బెస్ట్!

పాలు,పంచదార ఉంటే చాలు..ఇంట్లోనే దూది లాంటి రసగుల్లా రెడీ!

ఎప్పుడూ చేసుకునే దొండకాయ ఫ్రై బోర్ కొట్టిందా?ఈసారి ఇలా ట్రై చేయండి

గోధుమపిండితో చల్ల పునుగులు..మైదా లేకుండానే బెస్ట్ టేస్ట్

నిద్రలోనే పక్షవాతం రావచ్చు.. ఉదయం లేవగానే ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకూడదు

Big Stories

Advertisement
×