చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం Realme ఈ ఏడాది మేలో Realme C75 5Gని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి కొనసాగింపుగా Realme C85 Proను లాంచ్ చేయబోతోంది. ఇప్పటి వరకు డేట్ ఫిక్స్ కాకపోయినా, త్వరలో అందుబాటులోకి రాబోతోందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ హ్యాండ్ సెట్ కు సంబంధించి కీలక విషయాలు లీక్ అయ్యాయి. దాని డిజైన్, కలర్ ఆప్షన్లు బయటకు వచ్చాయి. దీని వెనుక ప్యానెల్ దాని పాత మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. నిలువుగా అమర్చబడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, పెరిగిన మాడ్యూల్ లో కనిపిస్తుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఆఫ్ లైన్ రిటైలర్ Realme C85 Pro హ్యాండ్ సెట్ హ్యాండ్ సెట్ ను పంచుకుంది. హ్యాండ్ సెట్ గుండ్రని మూలలతో బాక్సీ రూపాన్ని కలిగి ఉంది. బ్యాక్ సైడ్ ఒక దీర్ఘచతురస్రాకార కెమెరాను కలిగి ఉంది. ఇందులో మూడు నిలువుగా అమర్చబడిన లెన్స్ లు ఉన్నాయి. దీనికి LED ఫ్లాష్, రింగ్ లైట్ యూనిట్ కూడా ఉన్నాయి. లీక్ అయిన ఫోటోలను పరిశీలిస్తే, కెమెరా ఐలాండ్ మినహా బ్యాక్ ప్యానెల్ సాఫ్ట్ డిజైన్ ను కలిగి ఉంది. మ్యాట్ ఫినిషింగ్ తో కనిపిస్తుంది. కొన్ని డిజైన్ అంశాలతో పాటు, ఇది Realme C75 5Gలోని కెమెరా మాడ్యూల్ ను దగ్గరగా పోలి ఉంటుంది.
ఇక Realme C85 Pro స్మార్ట్ ఫోన్ మూడు రంగులలో కనిపిస్తుంది. బ్లాక్, గ్రీన్, పర్పుల్ కలర్ లో ఉంది. ఇక పర్పుల్ షేడ్ గ్రేడియంట్ రూపాన్ని కలిగి ఉంది. రిఫ్లెక్ట్ అయ్యే లైటింగ్ ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. Realme ఫోన్ల మాదిరిగానే, మీరు హ్యాండ్ సెట్ దిగువ-కుడి మూలలో Realme బ్రాండింగ్ ను కలిగి ఉంటుంది. పవర్, వాల్యూమ్ బటన్లు ఫ్రేమ్ ఎడమ వైపున ఉంచినట్లు తెలుస్తోంది.
గత నివేదికల ప్రకారం Realme C85 Pro ఇటీవల గీక్ బెంచ్ లో స్నాప్‌డ్రాగన్ 685 చిప్ సెట్, అడ్రినో 610 GPU, 8GB RAMతో రానుంది. ఇది సింగిల్ కోర్, మల్టీ కోర్ టెస్టులలో వరుసగా 466.. 1,481 పాయింట్లను స్కోర్ చేసినట్లు తెలిసింది. ఈ హ్యాండ్ సెట్ ను వియత్నాంలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లు, IP69-రేటెడ్ బిల్డ్ తో రావచ్చు. రియల్ మీ C85 ప్రో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఒకే ఛార్జ్ తో రెండు రోజుల వరకు వాడుకునే అవకాశం ఉంటుంది. దీనికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించవచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్ విడుదలకు సంబంధించి డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది.
Read Also: ఇవాళే Vivo X300 సిరీస్ లాంచ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కిర్రాక్ అంతే!