Poco F7 : పోకో F7 మెుబైల్ త్వరలోనే లాంఛ్ కాబోతుందనే లీక్స్ ఎప్పటినుంచో వినిపిస్తుంది. ఇక తాజా అప్‌డేట్‌లో Poco F7 యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ (EEC) డేటాబేస్‌లో కనిపించింది. దీంతో ఈ మెుబైల్ ఫీచర్స్ తో స్పెషిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ మెుబైల్ త్వరలోనే లాంఛ్ కాబోతున్నట్లు సైతం తెలుస్తుంది.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో. అందుబాటు ధరల్లోనే అధునాతన ఫీచర్ మెుబైల్స్ ను తీసుకురావడంలో ఈ సంస్థ ఎప్పుడు బెస్ట్ గా నిలుస్తుంది. ఇప్పటివరకు ఎన్నో మొబైల్స్ ను యూజర్ ఫ్రెండ్లీగా తీసుకువచ్చిన ఈ సంస్థ.. ఇప్పుడు మరో కొత్త మొబైల్ ను లాంఛ్ చేయడానికి సిద్ధమయిపోతోంది. తొందరలోనే ఈ సంస్థ నుంచి Poco F7 మొబైల్ రాబోతుంది. ఈ విషయాన్ని టెక్ అవుట్ లుక్ ప్రకటించింది.
The Tech Outlook ప్రచురించిన నివేదిక ప్రకారం.. Poco F7 మెుబైల్ నోటిఫికేషన్ KZ0000009843 నంబర్‌ను కలిగి ఉండటమే కాకుండా డిసెంబర్ 31, 2034 వరకూ వ్యాలిడిటీను కలిగి ఉంది. మోడల్ నంబర్‌లోని G ఇది గ్లోబల్ వేరియంట్‌గా ఉండబోతోందని సూచిస్తుంది. EEC లిస్టింగ్ సైతం ఈ మెుబైల్ అతి త్వరలోనే యూరోపియన్ మార్కెట్‌లో అరంగేట్రం చేస్తుందని తెలుస్తుంది. పాపులర్ మిడ్ రేంజ్ గా 5G సపోర్ట్ తో హై RAM ఫీచర్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక శక్తివంతమైన ప్రాసెసర్ తో పాటు మంచి కెమెరా క్వాలిటీతో ఈ మెుబైల్ వచ్చేస్తుంది.
Poco F7 స్పెసిఫికేషన్‌లు –
Poco F7 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ లీక్స్ కొన్నాళ్లుగా హల్చల్ చేస్తున్నాయి. ఈ గ్యాడ్జెట్ Redmi Turbo 4 మోడల్ లాగే అదే స్పెక్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంబోతోందని ఈ లీక్స్ తెలుపుతున్నాయి. ఇది MediaTek డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుందని… ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా హైపర్‌ఓఎస్ 2.0 తో నడుస్తుందని సమాచారం.
కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండబోతోందని అవుట్ లుక్ వెల్లడిస్తుంది. సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ స్నాపర్ ఉండబోతోందని, 6550mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రాబోతుందని సమాచారం.
పోకో మెుబైల్స్ లో భద్రతా ఫీచర్స్ సైతం అధునాతనంగా ఉంటాయి ఇక ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. అంతేకాకుండా, Poco F7 అల్ట్రా గ్లోబల్ సెక్టార్‌లకు ప్రత్యేకంగా నిలవనుందని సమాచారం. ప్రస్తుతానికి మొబైల్ కు సంబంధించిన ఇతర ఫీచర్స్ లీక్ అవ్వలేదు. పోకో ఈ ఫీచర్స్ ను అధికారికంగా ప్రకటిస్తే మిగిలిన ఫీచర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ మొబైల్ ఎప్పుడు లాంఛ్ కాబోతుందనే విషయం ఇప్పటివరకు తెలియలేదు.
ALSO READ : చాట్ జీపీటీలో కొత్త టూల్.. చైనాకు చెక్ పెట్టిన ఓపెన్ ఏఐ