Manoj VS Mohan Babu :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబంలో గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆస్తుల విషయంలో తనకు అన్యాయం జరిగిందని మంచు మనోజ్ (Manchu Manoj).. తన తండ్రి మోహన్ బాబు(Mohan babu ) తో గొడవ పడుతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. దీనికి తోడు పోలీస్ స్టేషన్, కోర్టు అంటూ తిరుగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదిలా ఉండగా సంక్రాంతి సందర్భంగా తిరుపతిలో జరిగిన గొడవ తర్వాత..మంచు మోహన్ బాబు.. మనోజ్ తన ఇంట్లో అక్రమంగా ఉంటున్నాడని, మనోజ్ ను తన ఇంటి నుండి ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో విన్నవించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు మనోజ్, మోహన్ బాబు కలెక్టరేట్ వద్ద హాజరయ్యారు.
కలెక్టరేట్ కి చేరుకున్న మోహన్ బాబు, మనోజ్..
అసలు విషయంలోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రేట్ కి చేరుకున్న సినీ నటులు మంచు మోహన్ బాబు.. తన ఆస్తులను కొంతమంది అక్రమంగా కబ్జా చేశారని, సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం వారిని ఖాళీ చేయించాలని కలెక్టర్ ను కోరగా.. మంచు మనోజ్ కూడా అదే కలెక్టర్ తో తనకు ఆస్తుల వాటా కావాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి మనోజ్ తో పాటు మోహన్ బాబు కూడా చేరుకున్నారు. ఆస్తి తగాదాల విషయంలో హాజరైన వీరు తన ఆస్తులను అక్రమంగా ఆక్రమించారని మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. నా కష్టార్జితంపై ఎవరికీ హక్కు లేదని తెలిపిన ఆయన, తన ఆస్తులు తనకు అప్పగించాలని అభ్యర్థించారు. అంతేకాదు తాను ఒక సీనియర్ సిటిజన్ అని కూడా పేర్కొన్నారు.
మెజిస్ట్రేట్ బయట గొడవపడ్డ తండ్రీ కొడుకులు..
ఇకపోతే ఈ విషయంలో అటు మంచు మోహన్ బాబు మంచు మనోజ్ ఇద్దరు కూడా ఘర్షణ పడ్డారు. ముఖ్యంగా వీరి గొడవను చూసిన పోలీసులు ఇక్కడ గొడవ పదొడ్డని గట్టిగా చెప్పడంతో బయటకు వెళ్ళిపోయారు. ఇకపోతే మేజిస్ట్రేట్ లో దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. ఆస్తి తగాదాకి సంబంధించి ప్రతిమ సింగ్ కి పూర్తి వివరాలు అందజేశారు. అనంతరం మేజిస్ట్రేట్ నుండి బయటకు వచ్చిన మంచు మనోజ్ అలాగే మంచు మోహన్ బాబు మేజిస్ట్రేట్ వద్ద ఇద్దరూ దూషించుకున్నారు. ఇక అనంతరం మీడియాతో మాట్లాడకుండా మంచు మనోజ్ ఆవేశంతో వెళ్లిపోయారు. వచ్చేవారం మరొకసారి మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరుకావాలని మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే తండ్రి కొడుకులిద్దరూ కూడా ఆస్తి కోసం ఇలా కోర్టు ముందు గొడవ పడడంతో ఉన్న పరువు కూడా పోయింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇక్కడ తండ్రి కొడుకులు ఆస్తుల కోసం గొడవ పడుతుంటే అక్కడ విష్ణు తన సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం అంతేకాదు మరి కొంతమంది కాస్త చెలరేగుతూ.. ఆ కొడుకుకి ఈ గొడవలు ఏమీ పట్టవా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.