E-Paper
Advertisement

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 9 మంది అధికారులకు కొత్త బాధ్యతలు!

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 9 మంది అధికారులకు కొత్త బాధ్యతలు!
Advertisement

IAS Transfers: రాష్ట్ర పాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున స్థానచలనం కల్పిస్తూ 9 మంది సీనియర్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమైన శాఖల బాధ్యతలను అనుభవజ్ఞులైన అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టింది.

కీలక శాఖల్లో మార్పులు ఇవే..

Advertisement

పరిశ్రమల శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన జయేష్ రంజన్‌ను అటవీ శాఖ స్పెషల్ సీఎస్‌గా నియమించారు. పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలను నవీన్ మిట్టల్ స్వీకరించనుండగా, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్ నియామకమయ్యారు. విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్‌గా వికాస్ రాజ్, యువజన సర్వీసుల శాఖ స్పెషల్ సీఎస్‌గా వాణి ప్రసాద్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

అదనపు బాధ్యతలు & ఇతర నియామకాలు

Advertisement

ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీగా ఇలాంబర్తి, HMDA కార్యదర్శిగా సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. రాహుల్ బొజ్జకు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీగా శృతి ఓజా, TG రెడ్కో MDగా జితేష్ వి పాటిల్ నియమితులయ్యారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌తో పాటు సదరన్ డిస్కం (TGSPDCL) సీఎమ్‌డీగా ముషారఫ్ ఆలీకి అదనపు బాధ్యతలు ఇచ్చారు. దీంతో పాటు మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా స్పెషల్ సెక్రటరీలను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులతో ఆయా శాఖల పనితీరు మరింత వేగవంతం కానుంది.

Also Read: రైళ్లు ఆపగలరేమో.. ఢిల్లీ రాకుండా ఆపలేరు! మహేష్ కుమార్ గౌడ్ సవాల్

Tags

Related News

తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్యాయత్నం.. చాకచక్యంగా కాపాడిన సైఫాబాద్ పోలీసులు!

రైళ్లు ఆపగలరేమో.. ఢిల్లీ రాకుండా ఆపలేరు! మహేష్ కుమార్ గౌడ్ సవాల్

కాప్రాలో సైబర్ కేటుగాళ్ల పంజా.. వ్యాపారి ఫోన్ హ్యాక్ చేసి రూ.30 లక్షలు స్వాహా!

క్షేత్రస్థాయికి వెళ్తే తెలుస్తుంది రైతుల తిప్పలేంటో!.. కాంగ్రెస్ సర్కార్‌పై బండి సంజయ్ మండిపాటు

రెండేళ్ల కూతుర్ని చంపి.. యువ దంపతుల ఆత్మహత్య, హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన, అసలు ఏం జరిగిందంటే..

ఇంత పనికిమాలిన ప్రభుత్వం ఎప్పుడైనా చూశామా.. కాంగ్రెస్‌పై జగదీశ్‌రెడ్డి ఫైర్!

బ్యాంక్ చెక్ బౌన్స్ కేసులో సంచలనం.. ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు!

Big Stories

Advertisement
×