E-Paper
Advertisement

ఫ్యాషన్ డిజైనర్ కావాలని సిటీకి… కట్ చేస్తే కథ రివర్స్… ఎమోషనల్ మూవీ

ఫ్యాషన్ డిజైనర్ కావాలని సిటీకి… కట్ చేస్తే కథ రివర్స్… ఎమోషనల్ మూవీ
Advertisement

Punjabi Emotional Drama: సినిమా రంగం లేదా గ్లామర్ వరల్డ్ అంటే బయట ప్రపంచానికి రంగురంగుల కలల లోకంలా కనిపిస్తుంది. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఎన్నో కన్నీళ్లు, అంతులేని పోరాటాలు ఉంటాయి. పెద్ద పెద్ద కలలతో సిటీకి వచ్చే ప్రతీ ఒక్కరి వెనుక ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. సరిగ్గా అలాంటి హృదయాలను హత్తుకునే కథతో వచ్చిన పంజాబీ మూవీనే ‘సిప్పియన్ సితారే’ (Sippiyan Sitare). మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అనే విషయంలోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళితే…

ఫ్యాషన్ డిజైనర్ కావాలనే ఆశయంతో తన సొంత ఊరును వదిలి నగరానికి వస్తుంది జగ్గ. తన ప్రతిభతో మంచి పేరు సంపాదించాలని, ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడుతుంది. తన కలలను నిజం చేసుకునే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటుంది. సిటీలో అడుగుపెట్టిన మొదట్లో అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా, అసలు సమస్యలు అక్కడే మొదలవుతాయి. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, తనకు తెలియని పరిస్థితులు జగ్గకు సవాళ్లుగా మారతాయి. తాను అనుకున్నట్లుగా ప్రతి అవకాశం సులభంగా దొరకదు. ఒకవైపు తన లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన, మరోవైపు జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

Advertisement

అయినప్పటికీ తన కలలను వదులుకోవడానికి జగ్గ సిద్ధంగా ఉండదు. ఈ ప్రయాణంలో జగ్గకు సమర్ పరిచయమవుతాడు. సమర్ ఒక టైలర్. ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కనే జగ్గ, కుట్టు పని చేసే సమర్ కలిసి తమ ఆశలను నిజం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇద్దరి పరిచయం క్రమంగా సన్నిహిత బంధంగా మారుతుంది. అయితే అనుకున్నదంతా సజావుగా సాగదు. అనుకోని పరిస్థితులు, ఎదురుదెబ్బలు వారి ప్రయత్నాలకు అడ్డంకులుగా మారతాయి. తమ కలలను సాకారం చేసుకోవడానికి మొదలు పెట్టిన ప్రయాణం కష్టాల్లో పడుతుంది. ఒకవైపు జగ్గ తన లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తుంటే, మరోవైపు సమర్ కూడా తన పనిని నిలబెట్టుకోవడానికి కష్టపడతాడు. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న జగ్గ ప్రయాణం, సమర్‌తో కలిసి సాగించే ఈ ప్రయత్నం ఎలాంటి మలుపులు తిరిగింది? ఎదురైన కష్టాల నుంచి ఇద్దరూ ఎలా బయటపడ్డారు? తమ కలలను నిజం చేసుకోవడానికి చివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అనేది ఈ మూవీలో చూడాల్సిన కథ.

జీవితంలో ఏదైనా సాధించాలని అనుకునే ప్రతి ఒక్కరికీ ఒక దశలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా సొంత ఊరిని వదిలి కొత్త నగరాలకు వచ్చి కెరీర్‌ను నిర్మించుకోవాలని ప్రయత్నించే యువతకు ఈ కథలోని అంశాలు బాగా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే కలలు కనడం ఎంత ముఖ్యమో, వాటిని నిజం చేసుకునే క్రమంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకుని నిలబడటం కూడా అంతే ముఖ్యమని ఈ కథ గుర్తుచేస్తుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?

Advertisement

‘సిప్పియన్ సితారే’ పంజాబీ భాషలో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమా చౌపాల్ ఓటీటీ (Chaupal OTT) వేదికగా అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేదు. కాబట్టి తెలుగు ఆడియోలో సినిమా చూడాలనుకుంటే కష్టం. ఈ సినిమాను కేవలం ఒక డ్రామా లాగా కాకుండా, ప్రతీ ఒక్కరి రియల్ లైఫ్ స్ట్రగుల్స్ కి కనెక్ట్ అయ్యేలా చాలా నేచురల్ గా తెరకెక్కించారు. లీడ్ యాక్టర్స్ ఎమోషనల్ సీన్స్ లో కన్నీళ్లు పెట్టించడం ఖాయం. వీకెండ్ లో ఏదైనా మంచి, మనసును తాకే కథ చూడాలనుకుంటే ఈ పంజాబీ మూవీ అస్సలు మిస్ కాకండి.

Read Also: దేవుడిని పరిచయం చేయడానికెళ్ళి డైరెక్ట్ గా దేవుడి దగ్గరకే… నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా

Related News

యుద్ధభూమిలో చావును జయించిన మృత్యుంజయుడు… ముందుంది ముసళ్ల పండగ… హై-వోల్టేజ్ సస్పెన్స్ థ్రిల్లర్

పిజ్జా షాప్‌లో పిచ్చి బాస్… ఈ కుర్రాళ్ల లైఫ్ చూస్తే మీ యంగ్ ఏజ్ గుర్తొస్తుంది భయ్యా… కొత్త కామెడీ సిరీస్

సిటీ డాక్టర్ పై మనసు పడే విలేజ్ కుర్రాడు… ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా

ది గ్రేట్ పంజాబ్ రాబరీ… సినిమాను తలపించే రియల్ హీస్ట్… గూస్‌బంప్స్ గ్యారెంటీ

ఏడుగురు పెళ్లికొడుకుల మధ్య చిక్కుకున్న అమ్మాయి కథ… ఫ్యామిలీ డ్రామానే

వందల ఏళ్ల రాజభవనం.. అప్పులపాలైన రాజవంశం… వైభవం నుంచి పతనం వరకు కంటతడి పెట్టించే మాస్టర్ పీస్

నవ్వినా అవుట్‌… భయపడినా అవుట్‌… హాలోవీన్‌ హంగామాలో అన్‌స్టాపబుల్ కామెడీ

Big Stories

Advertisement
×