Primate 10W mini soundbar: ప్రస్తుత రోజుల్లో మ్యూజిక్ లవర్స్‌కు పోర్టబుల్ స్పీకర్లు లేదా మినీ సౌండ్ బార్లు నిత్య జీవితంలో భాగమైపోయాయి. పెద్ద పెద్ద స్పీకర్లను మోసుకెళ్లడం కష్టమైన ఈ రోజుల్లో.. జేబులో పట్టేంత చిన్నవిగా లేదా టేబుల్ పై తక్కువ స్థలాన్ని ఆక్రమించే మినీ సౌండ్ బార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ..తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు అందించే.. డివైస్‌ల వైపే యూత్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారి కోసమే ‘ప్రైమేట్ 10W మినీ బ్లూటూత్ సౌండ్ బార్’ అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. దీని ఫీచర్లు, ధరకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిన్న సైజు సౌండ్‌బార్ అసలు ధర కేవలం రూ.478 మాత్రమే ఉండటం విశేషం. ఈ బడ్జెట్‌లో ఇంతకంటే మంచి ఆప్షన్ దొరకడం కష్టమనే చెప్పాలి. చూడడానికి అత్యంత ఆకర్షణీయమైన బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో, స్టెరియో ఛానెల్ సపోర్ట్‌తో ఇది వస్తుంది. ఆఫీస్ డెస్క్ మీద, బెడ్‌రూమ్ టేబుల్ మీద లేదా చిన్నపాటి పార్టీలలో పాటలు వినడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.దీని కాంపాక్ట్ డిజైన్ కారణంగా ఎక్కడికైనా ఈజీగా బ్యాగ్‌లో సర్దుకుని తీసుకెళ్లొచ్చు.
టెక్నాలజీ పరంగా చూస్తే.. ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ 5.0 టెక్నాలజీని అందించారు. దీని వల్ల మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్‌తో ఇది క్షణాల్లో కనెక్ట్ అవుతుంది.సిగ్నల్ కట్ అవ్వకుండా స్టేబుల్ కనెక్టివిటీని అందిస్తుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే.. 10 వాట్ల (10W) పవర్ అవుట్ పుట్ తో వస్తున్న ఈ మినీ సౌండ్ బార్ చిన్న రూమ్‌ను చక్కటి మ్యూజిక్‌తో నింపేస్తుంది. క్రిస్టల్ క్లియర్ వాయిస్, మంచి బేస్ ఫీల్ ఇది అందిస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ సౌండ్ వచ్చే మోడల్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు.
Also Read: నెక్స్ట్ లెవెల్ కూలింగ్..ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లతో లాభాలు ఇవే!
బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. ఇందులో పవర్ ఫుల్ 2000mAh బ్యాటరీని ఉపయోగించారు. ఒక్క సారి ఛార్జ్ చేస్తే సుమారు 10 గంటల పాటు నిరంతరం నాన్ స్టాప్ మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. అంటే.. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా కరెంట్ లేని సమయంలో బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ ఉండదు. ఎక్కువ సేపు మీరు మ్యూజిక్ దీంతో ఎంజాయ్ చేయొచ్చు. అంతే కాకుండా దీనికి టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. దీని వల్ల వేగంగా ఛార్జ్ చేసుకోవడానికి వీలవుతుంది. మార్కెట్లో దొరికే.. సాధారణ టైప్-సి కేబుల్స్ తోనే దీన్ని ఈజీగా ఛార్జ్ చేయొచ్చు. వీటిని ఛార్జ్ చేయడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
అతి తక్కువ ధరలో.. మంచి బ్యాటరీ లైఫ్, స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ‘ప్రైమేట్ 10W మినీ బ్లూ టూత్ సౌండ్ బార్’ ఒక పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో.. మంచి స్పీకర్ కొనాలని చూస్తుంటే.. దీనిని నిరభ్యంతరంగా కొనొచ్చు!