E-Paper
Advertisement

శ్రీనిధి కాళ్లు మొక్కబోయిన త్రివిక్రమ్.. ఏం జరుగుతోంది రా అయ్యా?

శ్రీనిధి కాళ్లు మొక్కబోయిన త్రివిక్రమ్.. ఏం జరుగుతోంది రా అయ్యా?
Advertisement

Trivikram:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సొంతం చేసుకున్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) . అద్భుతమైన డైలాగులతో డైలాగ్ రచయితగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయనకు.. ఇండస్ట్రీలో ఉండే గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఈయన తాజాగా చేసిన ఒక పని నెట్టింట సెన్సేషన్ గా మారింది. ఏకంగా ఒక స్టార్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఈయన అందరి ముందే ఒక యంగ్ హీరోయిన్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించడం సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారింది. మరి అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కబోయిన త్రివిక్రమ్..

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ (Venkatesh)హీరోగా, శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’. తమన్ (S.Thaman) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హైదరాబాదులోని శిల్పకళా వేదికగా అక్టోబర్ 27వ తేదీన సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఒక ఊహించని, ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్ కూర్చున్న చోటుకి వచ్చిన ఈ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టిని పలకరిస్తూనే.. ఉన్నట్టుండి సరదాగా ఆమె కాళ్ళు మొక్కేందుకు త్రివిక్రమ్ కిందికి వంగారు. అయితే త్రివిక్రమ్ ఆలా చేసేసరికి షాక్ అయిన శ్రీనిధి శెట్టి.. వెంటనే తేరుకొని ఆయనను వారిస్తూ.. తాను కిందకు వంగి ఆయన కాళ్ళకు నమస్కరించింది. తర్వాత వీళ్ళిద్దరూ ఒకరికొకరు దండం పెట్టుకుంటూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు.

Advertisement

also read:రామ్ ప్రసాద్ ని లాగిపెట్టి కొట్టిన త్రిగుణ్.. రోహిత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా?

త్రివిక్రమ్ కాళ్ళు మొక్కిన శ్రీనిధి శెట్టి..

అనంతరం శ్రీనిధి అక్కడున్న వారందరినీ చాలా ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరిస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఒక స్టార్ డైరెక్టర్ అయి ఉండి.. యంగ్ హీరోయిన్ ను అంత సింపుల్ గా, సరదాగా రిసీవ్ చేసుకున్న తీరును చూసి త్రివిక్రమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

త్రివిక్రమ్ చేసిన పనికి నెట్టింట కొత్త చర్చ..

Advertisement

ఇకపోతే శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో నటనకు మెచ్చి ఆ రేంజ్ లో ఆమెను అప్రిషియేట్ చేశారా? లేక వినోదం కోసమే అలా చేశారా ? లేక ఒక స్త్రీ మూర్తి అనే కోణంలో ఆమె కాళ్ళు మొక్కే ప్రయత్నం చేశారా? అన్నది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆయన ఏ ఉద్దేశంతో ఆమె కాలు మొక్కడానికి ప్రయత్నం చేశారో తెలియదు కానీ ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది . అంతేకాదు త్రివిక్రమ్ చేసిన ఈ పని సినిమాకు అదనపు హైప్ తీసుకొచ్చింది అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం అక్టోబర్ 30వ తేదీన ఆడియన్స్ ను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

ఫౌజీ టీజర్ వివాదం.. కేంద్రమంత్రికి లేఖ!

ఈసారి బాక్సాఫీస్ దగ్గర సిక్సర్లు కొడతామంటున్న వెంకీ మామ!

సుధీర్ సింగిల్ లైఫ్‌పై సత్తి సెటైర్లు.. దివ్యభారతి ముందు పరువు తీసేశాడుగా!

దివ్య భారతి దగ్గర బిత్తిరి సత్తి అల్లరి.. సుధీర్ నవ్వులు ఆపుకోలేదుగా!

హోమ్లీగా కనిపిస్తూనే గ్లామర్‌తోనూ మెప్పించనుందా.. పవర్ పేటలో రితికా!

ప్రణవి మానుకొండ అందాల విందు.. ఈ ఫోటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!

కోటి రూపాయల ఛాలెంజ్.. ‘కిల్లర్’ సెకండాఫ్ ట్విస్ట్ చెప్పడం అంత ఈజీ కాదట!

Big Stories

Advertisement
×