E-Paper
Advertisement

దమ్ముంటే ‘స్పిరిట్’ సినిమాని పడగొట్టండి.. సవాల్ విసిరిన ప్రొడ్యూసర్!

దమ్ముంటే ‘స్పిరిట్’ సినిమాని పడగొట్టండి.. సవాల్ విసిరిన ప్రొడ్యూసర్!
Advertisement

Spirit Movie: సాధారణంగా ఒక సినిమా విడుదల అయింది అంటే ఆ సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇచ్చే వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ నెగిటివ్ రివ్యూ ఇచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. సినిమా బాగున్నప్పటికీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమాని తొక్కేయాలన్న ఆలోచనలతో ఈ విధమైనటువంటి రివ్యూ ఇస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ విషయం పట్ల ఎంతోమంది దర్శక నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే సినిమాలను తొక్కేస్తున్నారని సినిమాలను బ్రతికించాలి అంటూ ఎంతో మంది నిర్మాతలు ఇదివరకే ఈ అంశంపై మాట్లాడిన సంగతి తెలిసిందే.

రోమాంచకం పై నెగిటివ్ రివ్యూ.. ప్రణయ్ ఫైర్..

ఇకపోతే తాజాగా రోమాచకం(Romanchakam) సినిమా విడుదల విషయంలో కూడా ఈ విధమైనటువంటి ధోరణి వచ్చిన నేపథ్యంలో సినిమా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ (Pranay Reddy Vanga) మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రోమాంచకం సినిమాపై వచ్చిన విమర్శలు గురించి ఈయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం వెనుక ఎంతో కష్టం ఉంటుందని అది కేవలం నిర్మాణ రంగంలో ఉన్న వారికి మాత్రమే తెలుస్తాయని ప్రణయ్ రెడ్డి తెలిపారు. ఒక రైటర్ రాసిన కథను తెరపైకి తీసుకురావాలి అంటే దర్శకుడు ఎంత కష్టపడతాడో షూటింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఎవరికీ అర్థం కాదు.

స్పిరిట్ సినిమాని పడగొట్టండి చూద్దాం..

Advertisement

మా రోమాచకం సినిమా రివ్యూ విషయంలో కొంతమంది కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు వ్యవహరించారు. నిజంగానే మీకు అలాంటి సామర్థ్యం ఉంటే త్వరలో నా నిర్మాణంలో రాబోయే స్పిరిట్ సినిమా(Spirit Movie) స్థాయిని తగ్గించగలరా? మీ రివ్యూ లతో ఈ సినిమాని చంపేయగలరా? మీకు దమ్ముంటే ఈ సినిమా స్థాయిని పడగొట్టండి అంటూ ప్రణయ్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రస్తుతం స్పిరిట్ సినిమా విషయంలో ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా స్పిరిట్..

ఇక స్పిరిట్ సినిమా భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సందీప్ రెడ్డి (Sandeep Reddy)సినిమా అంటేనే ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను చేరుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని 2027 మార్చ్ 5వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాలో మొదట దీపికా పదుకొనే ఎంపిక అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో తిరిగి ఆ అవకాశాన్ని యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి దక్కించుకున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు.

Advertisement

Also Read: కాకా వర్సెస్ విశ్వంభర సంక్రాంతి రేసులో వచ్చేదెవరు?

Related News

హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో చోరీ.. మొత్తం విలువ ఎంతంటే?

తాళి బొట్టు మహిళలే ఎందుకు వేసుకోవాలి ..నమిత కామెంట్స్ వైరల్ !

కాకా వర్సెస్ విశ్వంభర సంక్రాంతి రేసులో వచ్చేదెవరు?

ఎపిక్‌కి మిక్స్‌డ్ టాక్.. ఫ్లాప్ దిశగా వెళ్తుందా?

ముదురుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. కీలక సమావేశంపై కోర్టు స్టే!

‘శివాజీ’ మూవీ నటుడు ‘సోలమన్ పప్పయ్య’ మృతి!

రెమ్యూనరేషన్ ను పెంచేసిన మమిత..? స్టార్ హీరో కంటే ఎక్కువే..

Big Stories

Advertisement
×