Azam Khan On Pakistan Team: 2024 టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ (2024 T20 World Cup tournament) నేపథ్యంలో పాకిస్తాన్ జట్టులో ఉన్న ప్లేయర్లందరూ తనను బలి పశువు చేశారని వికెట్ కీపర్ ఆజం ఖాన్ (Azam Khan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో తనకు అవకాశం ఇచ్చి.. పాకిస్తాన్ ఎలిమినేట్ కావడానికి తానే కారణం అన్నట్టుగా తనను విలన్ చేశారని ఆగ్రహించాడు. మిగతా ప్లేయర్లు ఆడిన ప్రతి మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయిందని.. వాళ్లను టచ్ చేయకుండా చిన్నవాడైన తనను టార్గెట్ చేసి… అందరూ బయటపడ్డారని ఫైర్ అయ్యాడు. టీమిండియాను ఓడించలేని ఈ దద్దమ్మలు అందరూ ఏకమై తన కెరీర్ ను దెబ్బతీశారని మండిపడ్డాడు. దీంతో ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2024 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ అయింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా గ్రూప్ ఏలో పాకిస్తాన్, అమెరికా, టీమిండియా, కెనడా, ఐర్లాండ్ జట్టు ఉన్నాయి. ఇందులో అద్భుతంగా ఆడిన టీమిండియా, అమెరికా రెండు క్వాలిఫై కాగా పాకిస్తాన్ తో పాటు మిగిలిన జట్లు ఎలిమినేట్ అయ్యాయి. అమెరికా చేతిలో కూడా ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఓడిపోయింది. అయితే అమెరికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు వికెట్ కీపర్ ఆజం ఖాన్ (Azam Khan) అవకాశం ఇచ్చారు.
ఈ మ్యాచ్ లో ఒకే ఒక్క బంతి ఎదుర్కొన్న ఆజం ఖాన్ డకౌట్ అయ్యాడు. ఆజం ఖాన్ డక్ అవుట్ అయినప్పటికీ మిగతా ప్లేయర్లు చేతులెత్తేయడంతో అమెరికా చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడి టోర్నమెంట్ నుంచి గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ అయింది. అయితే.. డకౌట్ అయిన ఆజం ఖాన్ పైన అప్పట్లో దారుణంగా ట్రోల్స్ జరిగాయి. గ్రూప్ స్టేజ్ లో పాకిస్తాన్ ఎలిమినేట్ కావడానికి కారణం ఆజం ఖాన్ ఒక్కడే అన్నట్టుగా సీన్ క్రియేట్ చేసి అతడిని బలి చేశారు. ఇదే విషయాన్ని తాజాగా ఆజం ఖాన్ వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యాడు.
తన గోల్డెన్ డకౌట్ ను సాకు చూపి, వరల్డ్ కప్ వైఫల్యానికి తనను ఎలా బలి పశువు చేస్తారని నిలదీశాడు. ఈ విషయంపై తనకు తీవ్రమైన కోపం వచ్చిందని ఎమోషనల్ అయ్యాడు. తాను ఫిట్నెస్ సరిగ్గా మెయింటైన్ చేయడం లేదని కొంత మంది బహిరంగంగానే విమర్శించారని గుర్తు చేశాడు. కానీ పాకిస్తాన్ జట్టులో తనకంటే చెత్త వెధవలు చాలా మంది ఉన్నారని ఆగ్రహించాడు. 2024 వరల్డ్ కప్ సందర్భంగా తనను కావాలనే టార్గెట్ చేసి ఇరికించారని ఫైర్ అయ్యాడు. ఇప్పుడు అవకాశాలు లేకుండా చేశారని నిప్పులు చెరిగాడు.