Qubo Smart Dashcam Pro 2.7K: ఈ రోజుల్లో రోడ్లపై ప్రయాణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. అందుకే.. కార్ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికీ ‘డ్యాష్‌క్యామ్’అత్యంత అవసరమైన గ్యాడ్జెట్‌గా మారి పోయింది. ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం, తప్పుడు చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఇది డిజిటల్ సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ విభాగంలో.. హీరో గ్రూప్‌కు చెందిన క్యూబో సరికొత్త “Qubo Smart Dashcam Pro 2.7K + Rear” మోడల్‌ను పరిచయం చేసింది. పవర్‌ఫుల్ నైట్ విజన్, డ్యూయల్ కెమెరాతో వస్తున్న ఈ డివైజ్ పూర్తి వివరాలు.
క్రిస్టల్ క్లియర్ 2.7K క్వాలిటీ, డ్యూయల్ కవరేజ్:
క్యూబో స్మార్ట్ డ్యాష్‌క్యామ్ ప్రొ కేవలం ముందు వైపు మాత్రమే కాదు, కార్ వెనక భాగాన్ని కూడా రికార్డ్ చేయడానికి డ్యూయల్ ఛానల్ సపోర్ట్‌తో వస్తుంది. దీని ఫ్రంట్ కెమెరా 5MP QHD+(2.7K)రిజల్యూషన్‌తో అత్యంత స్పష్టమైన విజువల్స్ ఇస్తుంది. దీని వల్ల రోడ్డుపై వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లు, ట్రాఫిక్ సైన్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక దీని వెనక వైపు రికార్డింగ్ కోసం 2MP ఫుల్ హెచ్‌డీ కెమెరాను అందించారు, ఇది 140 డిగ్రీల వైడ్-యాంగిల్ వ్యూతో వెనక వచ్చే ట్రాఫిక్‌ను పూర్తిగా కవర్ చేస్తుంది.
చీకట్లోనూ అద్భుతమైన రికార్డింగ్:
చాలా డ్యాష్‌క్యామ్‌లు పగటిపూట బాగానే పనిచేసినా, రాత్రి వేళల్లో క్లారిటీ కోల్పోతాయి. కానీ.. క్యూబో తన ఈ మోడల్‌లో ‘నైట్‌పల్స్ విజన్’ (NightPulse Vision),అడ్వాన్స్‌డ్ హెచ్‌డీఆర్ టెక్నాలజీని ఉపయోగించింది. ఇది తక్కువ వెలుతురు ఉన్న రోడ్లపై లేదా రాత్రి వేళ ప్రయాణాల్లో కూడా కాంతిని అడ్జస్ట్ చేసి, నాయిస్ లేని స్పష్టమైన వీడియోలను రికార్డ్ చేస్తుంది. నైట్ డ్రైవింగ్ ఎక్కువగా చేసే వారికి ఇది ఒక సూపర్ ఫీచర్.
ఇన్-బిల్ట్ జీపీఎస్ :
ఈ స్మార్ట్ డ్యాష్‌క్యామ్‌లో ఇన్-బిల్ట్ జీపీఎస్ ఫీచర్ ఉంది. దీని వల్ల మీరు ప్రయాణించేటప్పుడు కారు ఏ లొకేషన్‌లో ఉంది. ఎంత స్పీడ్‌తో వెళ్తుంది అనే వివరాలు వీడియోలోనే రికార్డ్ అవుతాయి. దీనిలో ఉన్న వై-ఫై సపోర్ట్ ద్వారా క్యూబో ప్రో మొబైల్ యాప్‌ను కనెక్ట్ చేసి, మెమరీ కార్డ్ బయటకు తీయకుండానే.. ఫోన్ నుంచే లైవ్ వీడియోలను చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
భద్రతను పెంచే జీ-సెన్సర్:
కారుకు ఏదైనా ప్రమాదం లేదా అకస్మాత్తుగా జంప్ తగిలినప్పుడు ఇందులోని ‘G-Sensor’ టెక్నాలజీ ఆటోమేటిక్‌గా.. అలర్ట్ అయి, ఆ నిర్దిష్ట వీడియో క్లిప్‌ను లాక్ చేస్తుంది. దీని వల్ల లూప్ రికార్డింగ్‌లో పాత వీడియోలు డిలీట్ అయినా.. ఈ ముఖ్యమైన క్లిప్ మాత్రం సేఫ్‌గా ఉంటుంది. ఈ డివైజ్ 1TB వరకు భారీ స్టోరేజ్ మైక్రో ఎస్‌డీ కార్డ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ధర:
ఇన్ని ప్రీమియం,సేఫ్టీ ఫీచర్లు కలిగిన “Qubo Smart Dashcam Pro 2.7K + Rear” డ్యాష్‌క్యామ్ ప్రస్తుత మార్కెట్ ధర సుమారుగా రూ.7,641 (ఆఫర్లను బట్టి రూ.6,990 నుంచి రూ.7,990 మధ్య) అందుబాటులో ఉంది. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ నుంచి వస్తున్న ఈ గ్యాడ్జెట్ ప్రతి కార్ ఓనర్‌కు ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పవచ్చు.