శాస్త్రవేత్తలు ఏ ప్రయోగం అయినా ముందుగా ఎలుకల మీదే చేస్తారు. ఆ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాతే ముందుకు వెళ్తారు. అలాగే తాజాగా ఎలుకల మీద నిర్వహించిన ఓ పరిశోధనలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఎలుకలు డ్రైవింగ్ నేర్చుకునేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. డ్రైవింగ్ లో శిక్షణ పొందిన మూడు ఎలుకలు మినీ కార్ వైపు పరిగెత్తినట్లు గుర్తించారు. వాస్తవానికి ఎలుకలకు మినీ కార్లను డ్రైవింగ్ చేసే శక్తి ఉండదు. కానీ, డ్రైవింగ్ అనుభవాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ అధ్యయనాన్నిరిచ్‌మండ్ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరో సైంటిస్ట్ కెల్లీ లాంబెర్ట్ నిర్వహించారు. జంతువులు పర్యావరణంలో ఎలా పాలు పంచుకుంటాయి? కొత్త స్కిల్స్ పెంచుకునేందుకు ఎలా ప్రయత్నిస్తాయి? కొత్త విషయాలను తెలుసుకునే సమయంలో ఎంజాయ్ చేస్తారా? కష్టంగా ఫీలవుతాయా? అని తెలుసుకునేందుకు ఈ స్టడీ చేశారు.
ఎలుకలకు డ్రైవింగ్ నేర్పించిన లాంబెర్ట్ టీమ్
లాంబెర్ట్ టీమ్ ఎలుకల మీద 2019 నుంచి పరిశోధనలు కొనసాగిస్తున్నది. ఎలుకల కోసం చిన్న కార్లను డిజైన్ చేశారు. వాటికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. జంతువులు సరికొత్త స్కిల్స్ ఎలా నేర్చుకుంటాయోనని తెలుసుకునేందుకు ఈ పరిశోధన కొనసాగించారు. ఈ స్టడీ 2022లో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఎలుకలు డ్రైవింగ్ శిక్షణను కష్టంగా ఫీలవలేదు. చాలా ఆనందంగా ఎంజాయ్ చేశాయి. “ఈ పరిశోధనలో ఎలుకలు డ్రైవింగ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు అర్థం అయ్యింది. తరచుగా ఎలుకలు కారులోని దూకి హ్యాపీగా గడపడం గమనించాం. ట్రైనింగ్‌లో ఎలుకలకు లివర్ సిస్టమ్ ని ఉపయోగించి కార్లను ఆపరేట్ చేయడం నేర్చుకున్నాయి. డ్రైవింగ్ లో ట్రైనింగ్ తీసుకున్న మూడు ఎలుకలు ఆత్రంగా మినీ కారు వైపు వెళ్లడం గుర్తించాం” అని లాంబెర్ట్ వెల్లడించారు.
Read Also: ప్లీజ్ చచ్చిపో, చచ్చిపో… స్కూల్ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఏఐ డేంజరస్ ఆన్సర్
కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు ఆసక్తి చూపించిన ఎలుకలు
వాహనాలను ఆపరేట్ చేయడం ఎలుకల మెదడును ఉత్తేజ పరుస్తుందని లాంబెర్ట్ టీమ్ గుర్తించింది. ఇన్ స్టంట్ రివార్డు కోసం బటన్లను నొక్కడంతో పాటు రైడ్‌ను ప్లాన్ చేయడం, రైడ్ కోసం ఎదురు చూడడం, రైడ్ ను ఎంజాయ్ చేయడంతో ఎలుకల మెదడు చాలా ఉల్లాసంగా మారినట్లు లాంబెర్ట్ తెలిపారు. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం మెదడును ఎలా ప్రేరేపిస్తుంది? మనుషుల మాదిరిగానే జంతువులు సవాళ్లను ఎలా ఎదుర్కొంటాయో ఈ పరిశోధనలో గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే, ఇష్టం లేని పనితో పోల్చితే.. ఇష్టమైన పని చేసేందుకు ఎలుకలు ఆసక్తిగా ఎదురుచూసినట్లు తేల్చారు. మనుషుల మాదిరిగానే కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు గుర్తించారు. కొత్త విషయాలను తెలుసుకునే క్రమంలో ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించినట్లు తెలుసుకున్నారు. ఆసక్తికరమైన విషయాన్ని నేర్చుకునేందుకు జంతువులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాయని లాంబెర్ట్ టీమ్ వెల్లడించింది. ఎలుకలు అచ్చం ముషుల్లాగే ఫీలైనట్లు గుర్తించారు.
Read Also: ఇండియా టు అమెరికా అరగంటలో ప్రయాణం.. ఇది సాధ్యమే అంటున్న ఎలన్ మస్క్!