Suriya44: షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలు పెట్టిన కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) పిజ్జా (Pizza) సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే అద్భుతమైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. సినిమాను చాలా డిఫరెంట్ గా తీశాడు. టెక్నికల్ గా కూడా చాలామందికి మంచి ఎక్స్పీరియన్స్ ను ఇచ్చాడు. ఆ తర్వాత చేసిన జిగర్తాండ (Jigarthanda) సినిమా ఒక సంచలనం. ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అదే సినిమాను తెలుగులో గద్దల కొండ గణేష్ (Gaddala Konda Ganesh) పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని సాధించింది. వరుణ్ తేజ్ కెరియర్ లో ఒక సూపర్ హిట్ గా నిలిచింది.
Also Read : Kantara 2: కాంతారకు పోటీగా విజయ్.. ఇది వర్క్ అవుట్ అయ్యేలా లేదు బాసూ..?
ఇకపోతే కార్తీక్ కెరియర్ లో ఉన్న సూపర్ హిట్ సినిమాలలో పెట్ట (Petta) సినిమా కూడా ఒకటి అని చెప్పొచ్చు. రజనీకాంత్ (Rajinikanth) నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ని వసూలు చేసింది. రజనీకాంత్ అభిమానులకి ఒక విజువల్ ట్రీట్ లా అనిపించింది. ఈ సినిమాలో రజనీకాంత్ ను చూపించిన విధానం ఆ స్టైల్ ఆ స్వాగ్ అన్ని కూడా ఆడియన్స్ ను కట్టిపడేసాయి. వీటన్నిటిని మించి సినిమాకి అనిరుద్ (Anirudh Ravichandran) అందించిన మ్యూజిక్ పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. అద్భుతమైన సంగీతాన్ని అందించడంతోపాటు భీభత్సమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేశాడు. మామూలు సీన్స్ ని కూడా తన మ్యూజిక్ తో ఎలివేట్ చేశాడు.
Also Read: Shah Rukh Khan: నా నిర్ణయాల వల్లే తప్పులు జరిగాయి, అందుకే బాత్రూమ్‌లో కూర్చొని ఏడ్చేవాడిని..
కార్తీక్ తన కెరియర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశాడు. టెక్నికల్ గా కూడా ఆ సినిమాలు మంచి బ్రిలియంట్ గా అనిపించాయి. ఇకపోతే ధనుష్ (Dhanush) ,విక్రమ్ (Vikram) వంటి హీరోలతో కూడా సినిమాలు చేశాడు. విక్రమ్ ధృవ్ ను కలిపి మహాన్ (Mahaan) అనే సినిమాను చేశాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ సాధించింది. ఇక ప్రస్తుతం కార్తీక్ సూర్య (Suriya)తో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య నటిస్తున్న 44వ సినిమా ఇది. ఈ సినిమాలో సూర్య సరసన కథానాయికగా పూజ హెగ్డే (Pooja Hegde) నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియ (Shriya) ఒక స్పెషల్ సాంగ్ చేసినట్లు రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రీవీల్ చేసింది. మామూలుగా కార్తీక్ సుబ్బరాజు సినిమాల్లో ఇలాంటి స్పెషల్ సాంగ్స్ ఏమీ ఉండవు. కానీ ఈ సినిమాకి సంబంధించి కార్తీకి ఏం ప్లాన్ చేశాడు అంటూ చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.