SpaceX Ultra-Fast Travel| బిలియనీర్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ ఈ మధ్య ఏది పట్టుకున్నా బంగారంగా మారిపోతోంది. అంతలా ఆయనకు అదృష్టం కలిసివస్తోంది. అమెరికాలో కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆయన సన్నిహితుడు ఎలన్ మస్క్ నూతనోత్సహంతో కనిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో కీలక పదవి ఆయనకోసం కేటాయించారు. రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉంటూనే ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ ప్రయాణ రంగంలో ఒక విప్లవాత్మక టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
ఈ యుగంలో ప్రయాణ సమయం వీలైనంత తక్కువగా ఉండాలని అందరూ ఆశపడతారు. దీన్ని అవకాశంగా తీసుకొని ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. అదే స్టార్ షిప్ రాకెట్. దీని సాయంతో ప్రపంచంలోని ఏ దేశానికైనా 30 నుంచి 40 నిమిషాల్లోపు చేరుకోవచ్చు. ఈ టెక్నాలజీ గురించి స్పేస్ ఎక్స్ కంపెనీ పదేళ్ల క్రితమే సూచనలు చేసింది. అయితే తాజాగా దీని గురించి ట్విట్టర్ ఎక్స్ లో @ajtourville అనే యూజర్ ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో చూపించిన టెక్నాలజీ ప్రకారం.. అమెరికా నుంచి ఇండియాకు కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. వీడియోలో చూపించిన దృశ్యాల ప్రకారం.. అమెరికా లాస్ ఏంజిల్స్ నుంచి కెనెడా టొరొంటోకి చేరుకోవడానికి 24 నిమిషాలు, లండన్ నుంచి న్యు యార్క్ ప్రయాణానికి 29 నిమిషాలు, ఢిల్లీ నుంచి సాన్ ఫ్రాన్సిస్కో వరకు వెళ్లడానికి కేవలం 30 నిమిషాలు, న్యు యార్క్ నుంచి షాంఘై హాంగ్ కాంగ్ ప్రయాణం కేవలం 39 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఈ వీడియో పోస్ట్ కి ఎలన్ మస్క్ ఇది సాధ్యమే అంటూ రిప్లై ఇచ్చారు.
Also Read: మనుషులు భూమికి భారం చచ్చిపోతే మంచిది.. గూగుల్ ఎఐ షాకింగ్ రెస్పాన్స్
సాధారణంగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూ యార్క్ నగరానికి విమానం ద్వారా చేరుకోవాలంటే కనీసం 16 గంటల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ రాకెట్ టెక్నాలజీతో ఈ ప్రయాణ వ్యవధి 30 నిమిషాలకు తగ్గిపోతుంది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది సాధ్యమే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై పనులు జరుగుతున్నాయి. మరి కొన్ని సంవత్సరాలలో ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది.
వీడియోలో చూపించిన విధంగా ఈ ప్రయాణం విమానంలో కాదు ఒక రాకెట్ ద్వారా చేయాలి. ఈ రాకెట్ లో ఒక్కసారికి 1000 మంది ప్రయాణం చేయవచ్చు. ఈ రాకెట్ ఆకాశంలో జెట్ స్పీడుతో ఒక్కసారిగా దాదాపు భూకక్ష్య సరిహద్దుల దాకా వెళ్లి ఆ తరువాత గమ్యస్థానం వైపు నకు దూసుకొని వస్తుంది. దీంతో ప్రయాణం నిమిషాల్లో పూర్తవుతుంది.
అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టాక ఈ ప్రాజెక్ట్ కు అక్కడి ప్రభుత్వం సులువుగా అనుమతులు ఇచ్చేస్తుందనడంలో ఏ సందేహం లేదు. అలాగే ఈ రాకెట్ ప్రయాణం టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. విమాన కంపెనీల బిజినెస్ గట్టిపోటీ ఉంటుందనడంలో కూడా ఏ సందేహం లేదు.
Under Trump's FAA, @SpaceX could even get Starship Earth to Earth approved in a few years — Taking people from any city to any other city on Earth in under one hour. pic.twitter.com/vgYAzg8oaB
— ALEX (@ajtourville) November 6, 2024