BigTV English
Advertisement

Best Budget Camera Phones In India : రూ.30 వేలలో బెస్ట్ కెమెరా ఫోన్లు.. టాప్- 5 ఇవే!

Best Budget Camera Phones In India : రూ.30 వేలలో బెస్ట్ కెమెరా ఫోన్లు.. టాప్- 5 ఇవే!

Best Budget Camera Phones In India : ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం కబుర్లు చెప్పుకోడానికి మాత్రమే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సోషల్ మీడియా పుణ్యమంటూ స్మార్ట్‌ఫోన్లలో లెక్కలేనన్ని ఫీచర్లు ఉంటున్నాయి. అలానే స్మార్ట్ కొనాలంటే అందరూ కూడా హై క్వాలిటీ కెమెరా ఉన్న ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఇంటరెస్ట్ చూపుతున్నారు. అయితే మీకు పిండి కొద్దీ రెట్టే.. సమాతే మాదిరిగా మీకు ఎక్కువ ఫీచర్లు కావాలంటే బడ్జెట్ ఎక్కువగా కేటాయించాల్సి ఉంటుంది. కానీ తక్కువ బడ్జెట్‌లో కొన్ని బ్రాండెట్ కంపెనీల నుంచి బెస్ట్ కెమెరా అందించే స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వీటి కోసం మీరు కేవలం రూ.30 వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఆ ఫోన్లు ఎంటో ఇప్పుడు చూడండి.


Realme 12 Pro+ : రియల్ మీ 12 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది.  Qualcomm Snapdragon 7s Gen 2 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 32MP సెల్ఫీ కెమెరా, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఉంది. వెనుక కెమెరాలో 64MP OV64B పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి.

Also Read : 108 MP కెమెరా స్మార్ట్‌ఫోన్ రూ. 600 లకే.. ఫ్రీగా వాచ్ కూడా!


OnePlus Nord CE 4 :వన్‌ప్లస్ నార్డ్ CE 4 5G  స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌, 210Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్, HDR 10+ కలర్ సర్టిఫికేషన్ మరియు 10-బిట్ కలర్ డెప్త్‌కు సపోర్ట్ ఇస్తుంది. నార్డ్ CE 4 5G Qualcomm Snapdragon 7 Gen 3 SoCపై వస్తుంది. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం Adreno 720 GPU ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8MP సోనీ IMX355 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌, 50MP సోనీ LYT600 ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Oppo F25 Pro : ఒప్పో F25 ప్రో 5G 6.7-అంగుళాల పూర్తి HD+ ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 1100 nits బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో ఉంటుంది. అంతేకాకుండా IP54-రేటెడ్ కూడా ఉంది. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌లను నిర్వహించడానికి Mali-G68 MC4 GPUతో MediaTek Dimensity 7050 చిప్‌సెట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ 64MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరా, 2MP మాక్రో లెన్స్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

4) Redmi Note 13 Pro : ఈ ఫోన్ 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది 446 PPI పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. ఇందులో 200MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 200MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చబడింది. A 200MP అదనంగా, లో బ్రైట్నెస్ కోసం 16-ఇన్-1 మోడ్, 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. 16MP ఫ్రంట్ కెమెరాలో AI బ్యూటిఫై మోడ్, నైట్ మోడ్‌లు ఉన్నాయి.

Also Read : రేపే రియల్ మీ ఎర్లీ బర్డ్ సేల్.. 2 గంటలు మాత్రమే!

Motorola Edge 40 : మోటరోలా Edge 40 ఫుల్ HD రిజల్యూషన్‌తో 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.5-అంగుళాల pOLED ప్యానెల్‌తో వస్తుంది. ఫోన్ యొక్క డిస్‌ప్లే HDR10+, Amazon HDR ప్లేబ్యాక్, Netflix HDR ప్లేబ్యాక్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek డైమెన్సిటీ 8020 SoCతో పాటు 256GB UFS 3.1 స్టోరేజ్, 8GB LPDDR4xతో అందించబడింది. IP68తో ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్ ఇది.

Tags

Related News

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Meta Fake Ads Revenue: మోసపూరిత యాడ్స్‌తో లక్షల కోట్లు సంపాదించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఒక్క ఏడాదిలోనే

Amazon Offer on Smart Tvs: రూ.50 వేల టీవీ కేవలం రూ16 వేలకే.. అమెజాన్‌ సేల్‌లో టీవీలపై భారీ ఆఫర్‌

Smartphones comparison: పిక్సెల్ 10 ప్రో vs గెలాక్సీ S25 అల్ట్రా vs ఐఫోన్ 17 ప్రో.. ఎవరిది అసలైన టాప్­ఫ్లాగ్‌షిప్?

Big Stories

×