Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55| రియల్‌మీ 15 ప్రో 5G భారతదేశం మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇటీవల లాంచ్ అయింది. విడుదల కాగానే మార్కెట్ లోని ట్రెండింగ్ మిడ్ రేంజ్ ఫోన్లకు పోటీనిస్తోంది. ముఖ్యంగా వన్‌ప్లస్ నార్డ్ 5, శామ్‌సంగ్ గెలాక్సీ A55, రియల్‌మీ 15 ప్రో 5G మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఈ మూడు ఫోన్‌లలో ఏది మీకు సరైనదో చూద్దాం.
ధర, స్టోరేజ్
శామ్‌సంగ్ గెలాక్సీ A55 మూడు వేరియంట్‌లలో లభిస్తుంది: 8GB+128GB ధర ₹28,999, 8GB+256GB ధర ₹31,999, 12GB+256GB ధర ₹34,999.
వన్‌ప్లస్ నార్డ్ 5 రెండు వేరియంట్‌లను అందుబాటులో ఉంది. 8GB+256GB ధర ₹31,999, 12GB+256GB ధర ₹34,999.
రియల్‌మీ 15 ప్రో 5G నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది: 8GB+128GB ధర ₹31,999, 8GB+256GB ధర ₹33,999, 12GB+256GB ధర ₹35,999, మరియు 12GB+512GB ధర ₹38,999.
ధర విషయంలో రియల్ మీ.. మిగతా రెండు ఫోన్ల కంటే కాస్త ఎక్కువే.. కానీ మిగతా ఫీచర్లు పోల్చి చూసాకే విన్నర్ ఎవరో తేలిపోతుంది.
డిస్‌ప్లే / రిజల్యూషన్
శామ్‌సంగ్ గెలాక్సీ A55లో 6.6 ఇంచెస్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ 1,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 5లో 6.83 ఇంచెస్ AMOLED డిస్‌ప్లే ఉంది, దీని రిజల్యూషన్ 2800×1272, 144Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. రియల్‌మీ 15 ప్రో 5Gలో 6.8 ఇంచెస్ 4D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది, దీని రిజల్యూషన్ 2800×1280, 144Hz రిఫ్రెష్ రేట్, 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్.
ప్రాసెసర్ / సాఫ్ట్‌వేర్
శామ్‌సంగ్ గెలాక్సీ A55లో 4nm ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1పై నడుస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ 5లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 15పై నడుస్తుంది.
రియల్‌మీ 15 ప్రో 5Gలో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0పై నడుస్తుంది.
రియర్ (వెనుక భాగం) కెమెరాలు
సామ్‌సంగ్ గెలాక్సీ A55లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది: 50MP ప్రైమరీ కెమెరా (OISతో), 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5MP మాక్రో కెమెరా. వన్‌ప్లస్ నార్డ్ 5లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది: 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా (OISతో).
రియల్‌మీ 15 ప్రో 5Gలో కూడా డ్యూయల్ 50MP రియర్ కెమెరాలు ఉన్నాయి: ఒకటి ప్రైమరీ సెన్సార్, మరొకటి అల్ట్రా-వైడ్ లెన్స్.
ఫ్రంట్ కెమెరాలు
శామ్‌సంగ్ గెలాక్సీ A55లో 32MP ఫ్రంట్ కెమెరా (f/2.2 అపెర్చర్) ఉంది, ఇది సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు అద్భుతం. వన్‌ప్లస్ నార్డ్ 5లో 50MP సెల్ఫీ కెమెరా (f/2.0 అపెర్చర్) ఉంది. రియల్‌మీ 15 ప్రో 5Gలో 50MP ఫ్రంట్ కెమెరా (f/2.4 అపెర్చర్) ఉంది. ఇది స్పష్టమైన సెల్ఫీలను అందిస్తుంది.
కనెక్టివిటీ ఆప్షన్స్
శామ్‌సంగ్ గెలాక్సీ A55లో 5G, NFC, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.3, Wi-Fi, GPS, USB-C పోర్ట్ ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ 5లో 5G, NFC, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.4, Wi-Fi 6, GPS ఉన్నాయి.
రియల్‌మీ 15 ప్రో 5Gలో 5G, డ్యూయల్ 4G VoLTE, బ్లూటూత్ 5.4, Wi-Fi 6, డ్యూయల్ GPS, USB-C ఉన్నాయి.
బ్యాటరీ, ఛార్జింగ్
శామ్‌సంగ్ గెలాక్సీ A55లో 5,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 5లో 6,800mAh బ్యాటరీ, 80W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ 15 ప్రో 5Gలో 7,000mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్ ఛార్జింగ్ ఉంది.
శామ్‌సంగ్ గెలాక్సీ A55 బడ్జెట్‌లో నమ్మకమైన ఫోన్ కావాలనుకునే వారికి సరిపోతుంది. వన్‌ప్లస్ నార్డ్ 5 గేమర్స్‌కు బ్యాటరీ శక్తి కావాలనుకునే వారికి ఇదే బెస్ట్. భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లే కావాలనుకునే వారికి రియల్‌మీ 15 ప్రో 5G బెటర్ ఆప్షన్.
Also Read: విండోస్ 10 సపోర్ట్ త్వరలోనే ముగింపు.. సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇలా పొందాలి