Intinti Ramayanam Today Episode August 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. నువ్వు భరత్ ను పెళ్లి చేసుకొనే ముందు నువ్వు బాగా ఆలోచించు అని ప్రణతికి సలహా ఇస్తాడు అక్షయ్. అంతేకాదు తన గురించి చెప్తాడు. నన్ను బాగా చూసుకుంటుంది నాకు అన్నిట్లో సపోర్ట్ గా ఉంటుందని అనాధాశ్రమంలో పెరుగుతున్న ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి వల్లే మన కుటుంబం ఇలా ముక్కలైంది అన్న విషయం నీకు తెలిసిందే.. నువ్వు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటాడు. ప్రణతి ఎంత చెప్పిన అవని తప్పు చేసిందని అంటాడు. అవని పార్వతితో ప్రణతి పెళ్లి విషయం గురించి మాట్లాడాలని అనుకుంటుంది.
ఆ ఇంటికి వెళ్ళగానే పార్వతి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్న నీతో నేనేంది మాట్లాడేదేని పార్వతి అంటుంది.. ఏం చెప్తుందో వినొచ్చు కదా అని భానుమతి అంటుంది.. పల్లవి అప్పుడే వచ్చి నువ్వు నీ తమ్ముడి పెళ్లి చేయాలని అనుకుంటున్నావా? నువ్వు ఎవరూ లేరు ఒంటరిగా ఉన్నాను అంటున్నావ్ కదా.. నువ్వు ప్రతిసారి ఇక్కడికి వస్తున్నావు. అది నువ్వు ఆలోచించవా అని పల్లవి అంటుంది.. ప్రణతి భరత్ల పెళ్లి కోసమని నువ్వు ప్రతిసారి ఇక్కడికి వస్తున్నావు. పార్వతీ పల్లవి మాటలు విని అవనిని బయటికి తోసేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని దిగులు పడుతుంది. రాజేంద్ర ప్రసాద్ అవనిని అడుగుతుంది.. మీ అత్తయ్య నువ్వు చెప్పిన మాట వినదు కాబట్టే నేను వాళ్ళిద్దరికీ ద్దరికీ పెళ్లి చేయాలని అనుకున్నాను అని అంటాడు.. నువ్వు ఎన్నిసార్లు ఇలా వెళ్లిన సరే వాళ్లు నిన్ను అవమానిస్తూనే ఉంటారు. తర్వాత ప్రణతి భరత్ ని పిలిచి మనం ఏదో ఒకటి చేయాలి వదినకు అవమానం జరుగుతుంది అని ఆలోచిస్తారు. మా అమ్మ తన నిర్ణయాన్ని మార్చుకునేలా కనిపించలేదు.. మనమే ఏదో ఒకటి చేయాలి అని అంటుంది. భరత్ మాత్రం మా అక్క మీ అమ్మ ఒప్పుకున్న తర్వాతే పెళ్లి అంటుంది. వీళ్ళిద్దరూ పంతం ముందు మనం బలైపోయేలా ఉన్నాము ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని ప్రణతి భరత్ తో అంటుంది..
పార్వతి అక్షయ్ అని పిలిచి అవని ఇంటికి వచ్చిన విషయాన్ని చెప్తుంది.. ఇంతమంది ముందు నా పరువు తీసి నా కూతురిని ఆ అనామకుడితో పెళ్లి చేస్తే నేను బ్రతకను రా అని పార్వతి అక్షయ్తో అంటుంది. నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు చూసిన అబ్బాయి తోనే ప్రణతి పెళ్లి జరిగేలా నేను చూస్తాను అమ్మ అని పార్వతికి అక్షయ్ మాట ఇస్తాడు.. అయితే ఇక శ్రీయ పల్లవి ఎక్కడికి వెళ్లిందో అని ఆలోచిస్తుంది. ఈ పల్లవి అత్తయ్య ఈమధ్య చాలా క్లోజ్ అయిపోయారు నన్ను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు అని అనుకుంటుంది.
పల్లవి ఎక్కడికి వెళ్లిందో ముందు తెలుసుకోవాలి అని శ్రేయ అలా రాగానే ఎదురుగా పల్లవి వస్తుంది. ఎక్కడికి వెళ్లావు నువ్వు అని శ్రియ అడుగుతుంది. నేను ఎక్కడికి వెళితే నీకు చెప్పాలా అని పల్లవి అంటుంది. ఇంతకుముందు కాదు ఇప్పుడు కచ్చితంగా చెప్పాల్సిందే అని శ్రీయా అంటుంది. ఇంతకీ ప్రణతికి పెళ్లి సంబంధం చూస్తుంది నువ్వు మీ నాన్నే కదా అని అడుగుతుంది. అవును అని పల్లవి అంటుంది. ప్రణతితో తన తమ్ముడి పెళ్లి చేస్తే ఆ అవని మళ్లీ ఇంటికి వచ్చి పెత్తనం చాలా ఇస్తుంది అందుకే ఇలా చేశాను అని శ్రియాతో అంటుంది..
అవని అందరికీ భోజనం వడ్డిస్తాను కూర్చొని చెప్తుంది కానీ అక్షయ్ మాత్రం నాకు ఇప్పుడు వద్దు అని అంటాడు. ఆరాధ్య నాకు ఆకలేస్తుంది నాన్న నువ్వు కూర్చుంటే నేను కూర్చుంటాను అని అంటుంది. కూతురు మాట కాదనలేక అక్షయ్ భోజనానికి కూర్చుంటాడు. అందరితో సరదాగా తినడం బాగుంది అని అనుకుంటుంటారు. ప్రణతి భరత్ లు మాత్రం అవని చేతి వంట తినలేము. ప్రణతి రేపటి నుంచి మాతో కలిసి కూర్చునే అవకాశం నీకు రాదు వదిన ఇప్పుడు కూర్చొని తిందామని అడుగుతుంది..
ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. అదేంటి ప్రణతి అలా అన్నావు రేపటి నుంచి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అవని అడుగుతుంది. ఆరాధ్య అన్నయ్యని కూర్చోమని చెప్పింది కదా నువ్వు కూడా కూర్చో అందరం కలిసి తిందామని అంటున్నాను అని ప్రణతి అంటుంది. అయితే ఆరాధ్య అమ్మ కూడా నువ్వు తినిపించాలి అని అడుగుతుంది. అక్షయ్ ప్రేమగా అవనికి గోరుముద్దలు పెడతాడు. భానుమతి తన మొగుడు కొట్టాడని బాధపడుతూ ఉంటుంది. కమలు భానుమతిని ఓదారుస్తూనే మరోవైపు ప్రణతి పెళ్లి గురించి చెప్తాడు.
ఇక ప్రణతి భరతులు ఇంట్లోంచి వెళ్లేందుకు మొత్తం సర్దుకుని పెట్టుకుంటారు.. భరత్ ప్రణతి దగ్గరికి వస్తాడు. ప్రణతి ఇంట్లోంచి వెళ్లి పదం పదాన్ని అంటుంది. మనం ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతే అక్కని మోసం చేసిన వాళ్లమవుతాం ఇది ఆలోచించు అని భరత్ అంటాడు. ఇది మన సమస్య మన గురించి వదినకు ఏ సమస్య రాకుండా ఉండాలంటే మనము దూరంగా వెళ్లి పోవాల్సిందే అని ప్రణతి అంటుంది. భరత్ ప్రణతి మాట విని బయటికి వెళ్లడానికి సిద్ధపడతాడు. ఇద్దరూ కలిసి ఇంట్లోంచి బ్యాగులు తీసుకుని బయటకు వెళ్లిపోతారు.
Also Read : రోహిణి ముగ్గుతో షాక్.. మనోజ్, రోహిణికి బాలు దిమ్మతిరిగే షాక్.. సంజూకు సర్ ప్రైజ్..
ప్రణతి, భరత్ లు బయటికి రాగానే అక్కడ అక్షయ్ ఎదురుగా ఉండటం చూసి షాక్ అవుతారు. అక్షయ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. నాకు కొంచెం ఏదోలా ఉంది అనిపిస్తే వాకింగ్ చేద్దామని బయటికి వచ్చాం అన్నయ్య అని ప్రణతి అంటుంది. వాకింగ్ కు అయితే ఇలా లగేజ్ను సర్దుకొని వెళ్తారా అని అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భరత్ ని చక్రధర్ కావాలని ఇరికిస్తాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..