E-Paper
Advertisement

మ‌హ్మ‌ద్ అమీర్ దూల తీర్చిన మొహ్సిన్ న‌ఖ్వీ..ఐపీఎలే కాదు, PSL ఆడ‌కుండా బ్యాన్ ?

మ‌హ్మ‌ద్ అమీర్ దూల తీర్చిన మొహ్సిన్ న‌ఖ్వీ..ఐపీఎలే కాదు, PSL ఆడ‌కుండా బ్యాన్ ?
Advertisement

PSL ban On Mohammad Amir: పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ కు (Mohammad Amir ) ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. ఇటీవల బ్రిటిష్ పౌరసత్వం అందుకున్న మహమ్మద్ అమీర్.. ఇకపై పాకిస్తాన్ సూపర్ లీగ్ (Pakistan Super League ) ఆడకుండా పీసీబీ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ నిర్ణయం తీసుకున్నట్టు క‌థ‌నాలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Afghanistan Premier League 2026) ఆడేందుకు ఇటీవల మహమ్మద్ అమీర్ ధ‌రఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తమ శత్రుదేశం ఆఫ్గనిస్తాన్ నిర్వ‌హించే టోర్న‌మెంట్ తరఫున ఆడే వాళ్లను పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడించేది లేదని మెసేజ్ బయటకు పంపించేందుకు మహమ్మద్ అమీర్ పై చర్యలు తీసుకునేందుకు మొహ్సిన్ న‌ఖ్వీ సిద్ధమైనట్టు సమాచారం. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది.

30 మంది పాకిస్తాన్ ప్లేయర్లకు కూడా షాక్ ఇచ్చిన మొహ్సిన్ న‌ఖ్వీ

ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన ఫఖ‌ర్ జమాన్, సైమ్ ఆయూబ్, హాసన్ అలీ లాంటి 30 మంది క్రికెటర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. అయితే చివరి క్షణంలో ఈ 30 మందికి పైగా క్రికెటర్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ తేల్చి చెప్పాడు. తాలిబన్లు అలాగే పాకిస్తాన్ మధ్య విభేదాలు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అయితే మహమ్మద్ అమీర్ మాత్రం ఆడుకోవచ్చని తెలిపింది. బ్రిటిష్ పౌరుడిగా అతడు ఏం చేసినా తమకు సంబంధం లేదని వెల్లడించింది. కానీ ఆఫ్గనిస్తాన్ ప్రీమియర్ లీగ్ ఆడితే మాత్రం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడకుండా బ్యాన్ విధించడం గ్యారంటీ అని పీసీబీ హెచ్చరించింది. దీంతో మ‌హ్మ‌ద్ అమీర్ ప‌రిస్థితి పెనం నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్టు అయంది.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ఇదే

ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ డిసెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు యునైటెడ్ అర‌బ్ ఎమిరేడ్స్ వేదికగా నిర్వహిస్తారు. మొత్తం ఐదు ఫ్రాంచైజీ చెట్లు పాల్గొంటాయి. ఇక ఈ టోర్నమెంట్ నేపథ్యంలో మహమ్మద్ అమీర్ ను కాందహర్ వారియర్స్ ఫ్రాంచైజీ ప్లాటినం కేటగిరీ కింద కొనుగోలు చేసింది. ఆఫ్ఘానిస్తాన్ లో ప‌రిస్థితులు ఏ మాత్రం బాగా లేక‌పోవ‌డంతో యూఏఈలో ఏపీఎల్ 2026 ( APL) టోర్న‌మెంట్ నిర్వ‌హిస్తున్నారు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

అల్లా మీద ఒట్టు, వైభ‌వ్, అభిషేక్ ల‌ను పాకిస్తాన్ త‌ట్టుకోలేదు…50 ఓవ‌ర్ల‌లో 600 కొడ‌తారు

BBL తొలి మ్యాచ్..ఇండియాను అవ‌మానించిన ముస్తాఫిజుర్…సెఫ్టీ లేదంటూ కామెంట్స్‌!

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ వెధ‌వ‌లే.. 2024 వ‌ర‌ల్డ్ క‌ప్ లో న‌న్ను విల‌న్ చేశారు

ఆక్లాండ్ లో విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్..ఇలాంటోళ్లు వ‌న్డేల‌కు ప‌నికిరారు!

RCB జ‌ట్టులో న‌ర‌కం అనుభ‌వించా..స్మృతి మంధాన అంద‌రినీ తొక్కేసింది!

విరాట్ కోహ్లీ ఒక్కడే మొనగాడు…అతడే లేకపోతే టీమిండియా ఒక్క మ్యాచ్ గెలవదు

గిల్‌ను టార్గెట్ చేసిన పాక్ ఫ్యాన్స్…జొమాటో టీ షర్ట్ వేశాడంటూ ట్రోలింగ్ !

Big Stories

Advertisement
×