Realme GT 8| చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మి రెండు కొత్త పవర్ ఫోన్‌లను లాంచ్ చేసింది. GT 8, GT 8 ప్రో.. రెండూ కూడా టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. కానీ కొన్ని ముఖ్య తేడాలు వాటిని వేరుచేస్తాయి. మీ అవసరాలు, బడ్జెట్ ప్రకారం ఏది బెస్ట్ అని నిర్ణయించుకోవాలి.
రెండు ఫోన్‌లలోనూ 6.78-ఇంచ్ పెద్ద స్క్రీన్ ఉంది. ఇది AMOLED డిస్‌ప్లే, 2K రెజల్యూషన్‌తో షార్ప్‌గా ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రాలింగ్ మెరుగుగా ఉంటుంది. స్టాండర్డ్ GT 8 ప్రీమియం, సాలిడ్ బిల్డ్ ఇస్తుంది. GT 8 ప్రోలో యూనిక్ కస్టమైజబుల్ బ్యాక్ ఉంది. స్వాపబుల్ కెమెరా మోడ్యూల్‌తో బేసిక్ వేరియంట్ కంటే ఫోన్ మరింత స్టైల్‌గా ఉంది. ప్రో మోడల్ మరింత ప్రీమియం మెటీరియల్స్ ఉపయోగిస్తుంది. అడ్వాన్స్ కెమెరా హార్డ్‌వేర్ వల్ల కొంచెం బరువు ఎక్కువ.
ఫోన్లు డిఫరెంట్ టాప్-టియర్ ప్రాసెసర్లు ఉపయోగిస్తాయి. GT 8 పవర్‌ఫుల్ Snapdragon 8 Elite చిప్‌తో పని చేస్తుంది. GT 8 ప్రోలో కొత్త Snapdragon 8 Elite Gen 5 ఉంది. ఇది ప్రో వెర్షన్‌కు కొంచెం స్పీడ్ అడ్వాంటేజ్ ఇస్తుంది. రెండింటిలోనూ 16GB RAM వరకు వేరియంట్స్ ఉన్నాయి. 1TB స్టోరేజ్ స్పేస్ కూడా ఆప్షన్ ఉంది. ప్రోలో ఫాస్ట్ UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీ ఉంది. స్టాండర్డ్ మోడల్‌లో UFS 4.0 ఉంది.
రెండు మోడల్స్‌లోనూ 7,000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ రోజుంతా వినియోగానికి సరిపోతుంది. ఫోన్ రఫ్ గా ఉపయోగించేవారికి ఇది ఆప్షన్ చాలా బెటర్. GT 8లో 100W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ ఉంది, చాలా ఫాస్ట్. GT 8 ప్రోలో 120W వైర్డ్ చార్జింగ్ ఉంది, మరింత స్పీడ్. ప్రోలో 50W వైర్‌లెస్ చార్జింగ్ కూడా ఉంది. ప్రోకు ఇది మరో పెద్ద అడ్వాంటేజ్.
కెమెరా సిస్టమ్‌లో రెండు ఫోన్ల మధ్య పెద్ద తేడా ఉంది. GT 8 ప్రో.. ఫోటోగ్రఫీ పవర్‌హౌస్. 50MP మెయిన్ కెమెరా రికో ట్యూనింగ్‌తో ఉంది. 200MP టెలిఫోటో సెన్సార్ అద్భుతమైన జూమ్ ఇస్తుంది. 50MP అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. GT 8లో ట్రిపుల్ కెమెరా చాలా బాగుంది. 50MP మెయిన్, 50MP టెలిఫోటో. అల్ట్రావైడ్ 8MP.ఫ్రంట్ లో 16MP సెల్ఫీ కెమెరా ఉంది.
రెండు ఫోన్‌లు లేటెస్ట్ కనెక్టివిటీ స్టాండర్డ్స్ సపోర్ట్ చేస్తాయి. Wi-Fi 7, Bluetooth 6 ఉన్నాయి. ఇందులోని NFC ఫీచర్ తో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చేయవచ్చు. రెండింటిలోనూ స్ట్రాంగ్ కనెక్షన్స్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రోలో అయితే పీక్ స్పెసిఫికేషన్స్‌లో ఎడ్జ్ ఉంది. రెండింటిలో IP66, IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. అండ్రాయిడ్ 16తో Realme UI 7.0 రన్ అవుతాయి.
అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్ కోసం GT 8 ప్రో ఎంచుకోండి. ఫోటోగ్రఫీ ఎంతూజియాస్ట్‌లకు పర్ఫెక్ట్. ఫాస్టర్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ పెద్ద పెర్క్స్. కస్టమైజబుల్ డిజైన్ యూనిక్. స్టాండర్డ్ GT 8 కూడా మంచి వాల్యూ ఇస్తుంది. తక్కువ డబ్బులకు ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అమెజింగ్ బ్యాటరీ, గ్రేట్ పెర్ఫామెన్స్. గేమ్స్, డైలీ టాస్క్‌లు సులభంగా చేసుకోవచ్చు. మీ బడ్జెట్, కెమెరా అవసరాలపై డిపెండ్ అయి ఉంది.
ఈ ఫోన్‌లు చైనాలో లాంచ్ అయ్యాయి. ధర పరంగా GT 8 ప్రో ధర CNY 3,999 (సుమారు రూ.47,000) నుంచి ప్రారంభమవుతుంది. GT 8 కొంచెం తక్కువ. ఇండియాలో త్వరలో రావచ్చు. మీ అవసరాలకు తగ్గట్టు ఎంచుకోండి.
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే