iPhone Hidden features| మీ iPhoneలో చాలా ఉపయోగకరమైన రహస్య ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ మీ డివైస్‌లోని డీప్ మెనూ, సెట్టింగ్స్ లో దాగి ఉంటాయి. వీటిని సమర్థవంతంగా ఆన్ చేస్తే మీ రోజువారీ పనులను చాలా మరింత ఈజీగా, వేగంగా జరుగుతాయి. ఈ రహస్య ఫీచర్ల గురించిన సమాచారం మీ కోసం. ఈ అయిదు ఫీచర్లు ఫోన్‌లో చాలా రహస్య టూల్స్. ఈ టూల్స్ మీ డివైస్‌ని ఉపయోగించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి.
బటన్ కాంబినేషన్స్‌తో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ ఐఫోన్ బ్యాక్‌ని సింపుల్‌గా ట్యాప్ చేయండి. దీన్ని ఉపయోగించి స్క్రీన్‌షాట్ తీయండి. సెట్టింగ్స్ > యాక్సెసిబిలిటీ > టచ్ > బ్యాక్ ట్యాప్ వైపు వెళ్ళండి. “డబుల్-ట్యాప్” లేదా “ట్రిపుల్-ట్యాప్”ని ఎంచుకోండి. ఆప్షన్ల నుండి “స్క్రీన్‌షాట్”ని మాత్రమే సెలెక్ట్ చేయండి. ఈ ప్రాసెస్ త్వరగా, సులభంగా ఉంటుంది. ఆపిల్ లోగోను రెండు సార్లు ట్యాప్ చేస్తే సరిపోతుంది.. స్క్రీన్‌షాట్ వచ్చేస్తుంది.
మీ iPhone మీ చెవులు చేసే పనిని చేస్తుంది. ఉదాహరణకు డోర్‌బెల్ మోగడం వంటి శబ్దాలను గుర్తించగలదు. సెట్టింగ్స్ > యాక్సెసిబిలిటీ > సౌండ్ రికగ్నిషన్ వైపు వెళ్ళి స్విచ్‌ని ఆన్ చేయండి. తర్వాత, “సౌండ్స్”ని ట్యాప్ చేసి ఎలా వినాలో సెలెక్ట్ చేయండి. డోర్‌బెల్, అలారం, లేదా బేబీ క్రైయింగ్‌ని ఎంచుకోవచ్చు. డివైస్ ఆ శబ్దాలను వినగానే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.
ఐఫోన్ లో టైమర్ కోసం క్లాక్ యాప్ అవసరం లేదు. కంట్రోల్ సెంటర్‌ని టాప్-రైట్ కార్నర్ నుండి స్వైప్ చేసి తెరిచి, టైమర్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. టైమర్ ఐకాన్‌పై లాంగ్-ప్రెస్ చేస్తే ఒక సర్కులర్ ఆకారంలో మెనూ కనిపిస్తుంది. ఆ మెనూలో మీకు అవసరమైన సమయానికి మీ వేళ్ళను స్లైడ్ చేయండి. “స్టార్ట్” బటన్ కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేస్తే టైమర్ మొదలైపోతుంది. ఇది కిచెన్‌లో త్వరగా టైమర్ సెట్ చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.
మీ మెసేజెస్‌లను టైప్ చేయడానికి చాలా సమయం పడుతుందని ఫీలైతే.. ఆ సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. టెక్స్ట్ షార్ట్‌కట్స్ సృష్టించడం ద్వారా ఇది సాధ్యం. ఒక కీ ఫ్రేజ్‌తో పూర్తి వాక్యాలను మార్చవచ్చు. ఈ సెట్టింగ్స్‌కు వెళ్లండి. సెట్టింగ్స్ > జనరల్ > కీబోర్డ్ > టెక్స్ట్ రిప్లేస్‌మెంట్. “+” బటన్‌ను ట్యాప్ చేసి న్యూ (కొత్త) జోడించండి.
ఉదాహరణకు పూర్తి వాక్యం: “నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను.” దాని షార్ట్‌కట్: “ibt10.”
అంతే ఇకపై మీ ఫోన్ లో షార్ట్‌కట్‌ని టైప్ చేసినప్పుడు ఆ వాక్యాన్ని ఐఫోన్ స్వయంగా పూర్తి చేస్తుంది.
రాత్రి చదవడం సమయంలో మీ కళ్ళను కాపాడండి. సాధారణంగా రాత్రి వేళ గదిలో లైట్స్ ఆపేసి నప్పుడు ఫోన్ లైట్ కళ్లకు ఎక్కువగా అవుతుంది. అప్పుడు బ్రైట్‌నెస్ కాస్త తక్కువగా ఉండాలి. అందుకే వీలైనంత వరకు బ్రైట్‌నెస్‌ని తగ్గించండి. దీనికి కూడా షార్ట్ కట్ ఫీచర్ ఉంది. ముందుగా.. సెట్టింగ్స్ > యాక్సెసిబిలిటీ > డిస్‌ప్లే & టెక్స్ట్ సైజ్. “రిడ్యూస్ వైట్ పాయింట్” ఆప్షన్ కు సెలెక్ట్ చేయండి. ఈ ఫీచర్‌ని ఆన్ చేయండి. ఇక్కడ ఉన్న స్లైడర్‌ని ఉపయోగించి ఎంత చీకటి చేయాలో నిర్ణయించండి. మీ స్క్రీన్ తక్కువ బ్రైట్‌గా, చూడడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.
మీ iPhoneలో ఈ రహస్య ఫీచర్స్‌ను ఉపయోగించడం ద్వారా మీ రోజువారీ పనులు చాలా సులభమవుతాయి. ఐఫోన్‌ని మరింత సమర్థవంతంగా ఉపయోగించవచ్చు.
Also Read: : ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?