India Cheap Smartphone market| చైనా తర్వాత ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారత్. ఇక్కడ ప్రీమియం, మీడ్ రేంజ్, లో బడ్జెట్ అన్ని రకాల ఫోన్‌లు దొరుకుతాయి. భారత్ లోని నగరాల్లో కొన్ని మార్కెట్లలో ఫోన్ల ధరలు మిగతా చోట్ల కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఈ మార్కెట్లలో ఓపెన్ బాక్స్ (కొత్త) ఫోన్స్‌తో పాటు ఉపయోగించిన ఫోన్‌లు సేల్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఫోన్ కొనుగోలు చేస్తే వేల రూపాయలు సేవింగ్స్ చేసుకోవచ్చు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోల్ బాగ్ ప్రాంతంలో ఉన్న గఫ్ఫర్ మార్కెట్ చాలా ఫేమస్. ఇండియాలో అత్యంత తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌లు ఇక్కడే లభిస్తాయని ఈ ప్రాంతానికి పేరు ఉంది. ఇక్కడ శాంసంగ్, రెడ్‌మి, ఆపిల్ ఐఫోన్‌లతో అన్ని గ్లోబల్ బ్రాండ్‌లు దొరుకుతాయి. ఓపెన్ బాక్స్, రిఫర్బిష్డ్ ప్రొడక్ట్‌లు (సెకండ్ హ్యాండ్) అమ్ముడవుతాయి. ఈ సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొత్త స్మార్ట్ ఫోన్స్ కంటే 30 నుంచి 50 శాతం చవకగా ఉంటాయి. రూ. 20,000 విలువైన డివైస్ ఇక్కడ రూ. 11,000కే వస్తుంది. ఫోన్లలో ఉండే చిన్న చిన్న సమస్యలు రిపేరు చేసిన సెకండ్ హ్యాండ్ ఫోన్‌లు కూడా మీ బడ్జెట్‌కు సరిపోతాయి.
ముంబై మహానంగంలో స్మార్ట్ ఫోన్లు కొనాలంటే రెండు ప్రధాన ప్రాంతాలున్నాయి. మనీష్ మార్కెట్, క్రాఫర్డ్ మార్కెట్‌లు. ఇక్కడ స్మార్ట్‌ఫోన్‌ల చాలా తక్కువ ధరకు కొనడానికి బెస్ట్. ఇక్కడ చార్జర్లు, కేబుల్స్, స్క్రీన్ ప్రొటెక్టర్లు వంటి చవకైన యాక్సెసరీలపై కూడా మంచి డీల్స్ దొరుకుతాయి. చాలా దుకాణాలు హోల్‌సేల్ రేట్లకు విక్రయిస్తుంటాయి. ఒకటి కంటే ఎక్కువ ఫోన్‌లు కొనుక్కుంటే బల్క్ డిస్కౌంట్ ఇస్తారు. రెండు లేదా మూడు ఫోన్‌లు కొనుగోలు చేస్తే ధర మరింత తగ్గుతుంది. ఈ మార్కెట్లలో ఎక్కువ ఫోన్‌లు కొనుగోలు చేస్తే ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. సేల్స్ ప్రొమోషన్ కోసం వ్యాపారులు ఇలాంటి ఆఫర్లు ఇస్తుంటారు. వీటి ద్వారా కూడా లాభం పొందవచ్చు.
భారతదేశంలో తొలిసారిగా స్మార్ట్ ఫోన్ల హోల్ సేల్ మార్కెట్ ఏర్పడింది బెంగాల్ రాజధాని కోల్‌కతాలో. అందుకే చవకగా స్మార్ట్‌ఫోన్‌లు కొనాలంటే కోల్‌కతా మంచి ఆప్షన్. నగరంలోని చాంద్నీ చౌక్, ఫాన్సీ మార్కెట్‌లకు వెళ్లాలి. ఇక్కడ చాలా కొత్త ఫోన్లు చవకగా లభిస్తాయి. వీటితో పాటు ఉపయోగించిన, రిపేర్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లు చాలా తక్కువ ధరకు పొందవచ్చు. కొన్ని ఫోన్‌లు రూ. 5,000 కంటే తక్కువగా ధరలోనే లభిస్తాయి. చాలా స్టోర్లలో ఈఎమ్‌ఐ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉంటాయి. ఇది కస్టమర్లకు కొత్త ఫోన్ కొనడం సులభం చేస్తుంది. ఈ మార్కెట్లలో తక్కువ ధరలతో పాటు సులభమైన చెల్లింపు ఆప్షన్లు దొరుకుతాయి. పాత ఫోన్ ఇచ్చి కొత్తది తీసుకోవచ్చు.
దక్షిణ భారతదేశంలో చెన్నై నగరంలోని రిచీ స్ట్రీట్ టెక్ వస్తువులకు ప్రసిద్ధి. హైదరాబాద్‌లోని కోఠీ మార్కెట్ కూడా అంతే ఫేమస్. ఈ రెండు మార్కెట్లలో తక్కువ ధరలతో చైనా ఫోన్‌లు, రిఫర్బిష్డ్ ఐఫోన్‌లు, బడ్జెట్ ఆండ్రాయిడ్ మోడల్స్ అమ్ముడవుతాయి. అయితే ఈ మార్కెట్లలో కాస్త బార్గెయినింగ్ చేస్తే బెటర్. మంచి బార్గెనింగ్ చేస్తే ధర రూ. 1,000-2,000 తగ్గవచ్చు. రిచీ స్ట్రీట్‌లో అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు దొరుకుతాయి. కోఠీలోని జగదీష్ మార్కెట్ కూడా చవకైన ఫోన్‌లకు ప్రసిద్ధి.
కొన్నిసార్లు ఈ ఆఫ్‌లైన్ మార్కెట్లు ఆన్‌లైన్‌ల కంటే చవకగా ఉంటాయి. దుకాణదారులు డిస్ట్రిబ్యూటర్ నుంచి నేరుగా స్టాక్ తీసుకుంటారు. మధ్యవర్తి కమిషన్ ఉండదు. కాబట్టి కస్టమర్‌కు నేరుగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. మీరు పేమెంట్ చేసే ముందు ఫోన్ బాగా చూసి, టెస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇది ఆన్‌లైన్‌లో సాధ్యం కాదు. ఈ మార్కెట్లలో డైరెక్ట్ కొనుగోలు వల్ల ధరలు తక్కువగా ఉంటాయి.
Also Read: ప్రపంచంలోని అన్ని టీవి ఛానెల్స్ ఫ్రీ.. మీ స్మార్ట్‌ఫోన్‌లో లైవ్ టీవి ఉచితం.. ఇలా చూసేయండి