Siddipet Crime: మద్యానికి దూరంగా ఉండాలని పెద్దలు పదేపదే చెబుతుంటారు. కొందరు ఫ్యాషన్‌గా భావిస్తుంటారు. మరికొందరు దానికి బానిస అవుతారు. ఫలితంగా ఫ్యామిలీలో అనేక అనర్థాలు జరిగిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా మద్యం మత్తులో తండ్రిని చంపేసి చెరువులో పడేశాడు కన్నకొడుకు. దారుణమైన ఘటన సిద్దిపేట్ జిల్లాలో వెలుగుచూసింది.
మద్యం మత్తులో తండ్రి చంపిన కొడుకు
మేడ్చల్ పోలీసుస్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సిద్దిపేట్ జిల్లా ములుగు మండలం అచ్చంపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్‌ని కొడుకులు ఉన్నారు. కాకపోతే పని పాటా లేకుండా తిరిగేవారు. దీన్ని గమనించిన తండ్రి నిజాముద్దీన్.. కొడుకులను మందలించేవాడు. రోజు తప్పించి రోజు తండ్రి టార్చర్ తట్టుకోలేకపోయాడు సాథిక్.
ఎలాగైనా తండ్రికి బుద్ధి చెప్పాలని భావించాడు. ఫుల్‌గా మద్యం తాగాడు. ఆ మత్తులో తండ్రితో గొడవ పడ్డాడు. పట్టరాని కోపంతో తండ్రి నిజాముద్దీన్‌ను సాథిక్ బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ ఘటన ప్రజయ్ వాటర్ ప్లాంట్ వద్ద జరిగింది. స్థానికులు ఈ ఘటనను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సాథిక్‌తోపాటు అతడి స్నేహితుడ్ని రాజుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ALSO READ: అంత్యక్రియల్లో అపశృతి.. నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి
అత్తాపూర్‌లో దారుణం
మరోవైపు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. డ్రై క్లీనింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సుమారు ఏడాది కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ యువకుడు. ఆ తర్వాత భార్యతో విభేదాలు వచ్చాయి. చివరకు ఆమె తన సొంత ఇంటికి వెళ్లిపోయింది.
భార్య కాపురానికి రాలేని ఆత్మహత్య
భార్యను రావాలని పలుమార్లు కోరినప్పటికీ రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు, ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చారు.
కన్నతండ్రిని చంపేసి.. మృతదేహాన్ని..
జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అలియాబాద్ మున్సిపల్ పరిధి తుర్కపల్లిలో ఓ వ్యక్తి తన తండ్రిని హత్య చేసి మలక చెరువులో పడేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు… pic.twitter.com/Wxz9plC7xh
— ChotaNews App (@ChotaNewsApp) October 22, 2025