OTT Movie : ప్రేమ కథలు చూడటానికి అందంగానే కనబడతాయి. కానీ కొన్ని స్టోరీలు మోసాలతో క్రైమ్ టర్న్ తీసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఒక సరికొత్త వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అలాంటి సీన్లతో పాటు, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఈ కథ ప్రేమ పేరుతో ఒక యువతిని మోసం చేస్తుంటాడు ప్రియుడు. అంతేకాకుండా ఆమెను బ్లాక్ మైల్ కూడా చేస్తాడు. దీంతో కథ మరో లెవెల్ కి వెళ్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
‘స్వెట్ ఆర్ సీక్రెట్స్’ (Sweat Aur Secrets) ఇది హిందీ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీపాంకర్ ప్రకాష్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో తినా దత్తా, గుల్షన్ ఆర్. నయిన్, సాహిబ్ తాగ్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2025 సెప్టెంబర్ 30 నుంచి ShemarooMe ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఎపిసోడ్‌లతో వచ్చిన ఈ సిరీస్, IMDbలో 7.2/10 రేటింగ్ పొందింది.
ముంబైలో నివసించే సానియా అనే యువతి ఒక అంబిషనస్ మహిళ. అంతే కాదు ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో స్టార్. ఆమె ఒక పెద్ద ఫిట్‌నెస్ బ్రాండ్ స్టార్ట్ చేస్తుంది. ఆమె బిజినెస్ పార్ట్‌నర్, లవర్ అయిన రాహుల్ ఆమెతో కలిసి బ్రాండ్ లాంచ్ చేస్తాడు. కానీ రాహుల్‌కు తన స్వంత ప్లాన్ ఉంది. అతను ఆ బ్రాండ్‌ను తన కంట్రోల్‌లోకి తీసుకోవాలనుకుంటాడు. సానియా బ్రాండ్ లాంచ్ సమయంలో ఒక మిస్టీరియస్ థ్రెట్ వస్తుంది. ఆమె పాస్ట్ గురించి ఎవరో బ్లాక్‌మెయిల్ చేస్తారు. సానియా తన బ్రాండ్‌ను సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేస్తుంది. కానీ విక్రమ్ అనే వ్యక్తి ఆమె పాస్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకుని, ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తాడు.
Read Also : పక్కనున్న భార్య మిస్సింగ్ అంటూ కేసు… పోలీసులకే పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్