BigTV English
Advertisement

Realme Neo GT Neo 6 SE: రియల్‌మీ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్..!

Realme Neo GT Neo 6 SE: రియల్‌మీ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్..!


Realme Neo GT Neo 6 SE: ప్రముఖ స్మార్ట్‌ఫోర్ సంస్థ రియల్‌మీ వరుస ఫోన్లను రిలీజ్ చేస్తుంది. మిడ్రేంజ్ ప్రైజ్‌లో ఎక్కువగా ఫోన్లను తీసుకొస్తుంది. ప్రైజ్ తక్కువగా ఉన్నా ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అయితే ఈ మొబైల్ ఇండియాలో కాదు చైనా మార్కెట్‌లో త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ను కంపెనీ టీజ్ చేసింది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ ఆధారపడి ఉంటుంది.

రియల్‌మీ జీటీ నియో 6లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్ ప్రాసెసర్ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ త్వరలో విడుదల చేయనుంది. భారత్‌లో మార్కెట్‌లో కూడా ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.


క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్‌లో ఇందులో అందించనున్న 7 ప్లస్ జెన్ 3నే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్. బెంచ్ మార్క్ వెబ్ సైట్లలో కూడా ఇది తన సత్తా నిరూపించుకుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ 8 జెన్ 3లో అందించిన ఆర్కిటెక్చర్‌నే ఇందులో కూడా అందించారు. ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం మేరకు. ఈ ఫోన్‌లో 1.5కే ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోరట్ ఉంటుంది.

Also Read: రూ.7 వేలలో తోపు ఫోన్లు .. మిస్ చేయకండి!

గతేడాది విడుదలైన రియల్‌మీ జీటీ నియో 5 ఎస్ఈ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 2 ప్రాసెసర్‌తో రిలీజ్ అయింది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఉంది. ఫోన్ వెనకవైపు ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్. ఇందులో 144 హెజ్డ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.74 ఇంచెస్ 1.5కే డిస్‌ప్లే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. సెల్ఫీ, వీడియో కాల్స్‌కు మంచి క్వాలిటీ అందిస్తుంది. దీని బ్యాటరీ 5500 ఎంఏహెచ్ , 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

అలానే రియల్ మీ ఇండియాలో న్యూ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ. ఈ ఫోన్ అమెజాన్‌లో సేల్‌కు రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు అనేక ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ను కలిగిన ప్రైమరీ కెమెరా సెటప్ ఉంటుంది.

Also Read: బంపరాఫ‌ర్.. బ‌డ్జెట్ స్మార్ట్ వాచ్ ధ‌ర‌కే 5జీ మొబైల్.. ఆఫర్ మిస్ చేయ‌కండి

ఈ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌‌కు సపోర్ట్ చేస్తాయి. 1/1.56 అంగుళాల సెన్సార్ పరిమాణంతో వచ్చే ప్రధాన కెమెరాకు అందించారు. ఈ ఫోన్ ప్రధాన కెమెరా మునుపటి వెర్షన్ కంటేఎక్కువ కాంతిని క్యాప్చర్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది.

Related News

Snapchat AI Search: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Big Stories

×