BigTV English

Ravichandran Ashwin Emotional Comments: ధోనీ లేకపోతే.. నేను లేను: అశ్విన్ భావోద్వేగం

Ravichandran Ashwin Emotional Comments: ధోనీ లేకపోతే.. నేను లేను: అశ్విన్ భావోద్వేగం

Ravichandran Ashwin latest newsRavichandran Ashwin Emotional Comments on MS Dhoni: ఇంగ్లాండ్ సిరీస్ ఏ ముహూర్తానా జరిగిందో రవిచంద్రన్ అశ్విన్ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోయింది. ఇన్నాళ్లూ ఏదో ఆడుతున్నాడు, వస్తున్నాడు, వెళుతున్నాడన్నట్టే ఉండేది… కానీ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగుల్లో నెంబర్ వన్ స్పిన్నర్ అయ్యాడు. 500 వికెట్ల క్లబ్ లో ఉన్నాడు. వంద టెస్టులు ఆడేశాడు. అలాగే ప్రపంచంలో టాప్ క్రికెటర్ల సరసన చేరాడు.


ఈ నేపథ్యంలో తమిళనాడు క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అశ్విన్ కు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అశ్విన్ తన కెరీర్ లోని ఎన్నో కీలక విషయాలపై మాట్లాడాడు.

2008లో నేను సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్ లో గొప్ప క్రికెటర్లను కలిశాను. ముత్తయ్య మురళీధరన్ జట్టులో ఉండటంతో నాకు అవకాశాం రాలేదు. అయినా ఖాళీ సమయంలో ముత్తయ్య పలు టెక్నిక్ లు చెప్పాడు. అవి నా కెరీర్ కి ఎంతో ఉపయోగపడ్డాయని అన్నాడు.


Also Read: Musheer Khan: ఐపీఎల్ లో కొనుగోలు చేయకపోయినా బాధ లేదు: ముషీర్ ఖాన్

మొత్తానికి తర్వాత సీజన్ లో ఆరంగేట్రం చేశాను. క్రిస్ గేల్ వంటి భయంకరమైన బ్యాటర్ కి తొలి ఓవర్ వేసే అవకాశాన్ని ధోని నాకిచ్చాడు. అంటే నా మీద కాదు, నా సమర్థత మీద, నా బౌలింగ్ మీద ధోనికీ అపరిమితమైన నమ్మకం. అది నిలబెట్టుకోవాలని అనుకున్నాను. నాలుగో బాల్ కి వికెట్ పడింది. నా కెరీర్ కి ఎంతో ఉపయోగపడింది.

కానీ ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో క్రికెట్ ఆడాను. ఈ సమయలో నాకెంతో అనుభూతి, ఆనందాన్నించింది ఏమిటంటే భారత్ లెజండరీ క్రికెటర్లలో అనిల్ భాయ్ ఒకరు. తను నన్ను ప్రశింసిస్తుంటే ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యానని అన్నాడు. తను నన్ను అభినందించాన్ని ఎప్పుడూ గర్వంగా ఫీలవుతానని అన్నాడు.

తర్వాత నాకు నెట్స్ లో సహకరించిన తోటి ఎడమ చేతి ఆటగాడు శరత్ కి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఎడమ చేతి వాటం బ్యాటర్లకి బాల్ వేసేటప్పుడు ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు కట్టడి చేయగలుగుతున్నాను. తనెంతో అద్భుతమైన ఆటగాడు. అతన్ని అవుట్ చేయమని చెప్పేవారు. నేను విపరీతంగా నెట్స్ లో శ్రమించాను. అతను కూడా అంతే విధంగా

Also Read: WPL 2024 Final Match Highlights: నేడు WPL ఫైనల్.. ఢిల్లీతో బెంగళూరు ఢీ!

నా బాల్స్ ఆడాడు. నా బౌలింగ్ మెరుపడేందుకు దోహదపడ్డాడు. ఒకే ఒక్కసారి అతన్ని అవుట్ చేశాను. అంత గొప్ప ఆటగాడని చెప్పుకొచ్చాడు.

తమిళనాడు క్రికెట్ స్టేడియంతో నా అనుబంధం విడదీయరానిది. నేను ఉన్నా, లేకపోయినా నా ఆత్మ ఈ గ్రౌండ్ లోనే తిరుగుతుంటుందని భావోద్వేగంతో అన్నాడు. ఇకపోతే అశ్విన్ తన ప్రస్థానంలో వందో టెస్టు కూడా ఆడేశాడు. మరిన్ని టెస్టులు ఆడి భారత క్రికెట్ కి తనవంతు సేవలందించాలని మనం కూడా కోరుకుందాం.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×