E-Paper
Advertisement

Realme Narzo N61 Launched: చౌక ఫోన్.. రూ. 7,499లకే లాంచ్ అయిన రియల్‌మి కొత్త మొబైల్.. ఫీచర్లు హైలైట్..!

Realme Narzo N61 Launched: చౌక ఫోన్.. రూ. 7,499లకే లాంచ్ అయిన రియల్‌మి కొత్త మొబైల్.. ఫీచర్లు హైలైట్..!

Realme Narzo N61 Launched: ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మి తాజాగా Realme Narzo N61 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP54-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 6GB RAMతో జత చేయబడిన ఆక్టా-కోర్ Unisoc చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ సేల్ ఆగస్టు నుంచి జరగనుంది.

Realme Narzo N61 Specifications

Realme Narzo N61 స్మార్ట్‌ఫోన్ 6.74-అంగుళాల HD+ (1,600 x 720 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 560nits గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. అలాగే ఈ హ్యాండ్‌సెట్ ArmorShell ప్రొటెక్షన్, TÜV రీన్‌ల్యాండ్ హై-రిలయబిలిటీ సర్టిఫికేషన్‌తో వస్తుంది. డిస్‌ప్లే రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ టెక్నాలజీను కలిగి ఉంది. ఇది Unisoc T612 SoC ద్వారా 6GB RAM + 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. RAMను వర్చువల్‌గా 6GB నుండి 12GB వరకు విస్తరించుకోవచ్చు.

Also Read: వివో నుంచి బడ్డెట్ ఫోన్.. ఆగస్టు 7 న లాంచ్.. ధర ఎంతంటే?

ఈ ఫోన్ మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్ విస్తరించుకోవచ్చు. ఇది Android 14-ఆధారిత Realme UI 4.0తో రన్ అవుతుంది. ఆప్టిక్స్ కోసం.. Realme Narzo N61 32-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ముందు కెమెరా 5-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. Realme Narzo N61 ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 30 గంటల వరకు వాయిస్ కాల్ సమయాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-సి కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.

Realme Narzo N61 Price

Realme Narzo N61 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 4GB + 64GB వేరియంట్ ధర రూ. 7,499, అలాగే 6GB + 128GB వేరియంట్ ధర రూ. 8,499గా కంపెనీ నిర్ణయించింది. ఈ హ్యాండ్‌సెట్ మొదటి సేల్ ఆగస్టు 6న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. కొనుగోలుదారులు మొదటి సేల్‌లో రూ. 500 కూపన్ తగ్గింపు పొందవచ్చు. ఇది Amazon, Realme India వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ మార్బుల్ బ్లాక్, వాయేజ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది.

Tags

Related News

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

Big Stories

×