BigTV English

Miss Vizag Nakshatra shocking issues reveals: మిస్ వైజాగ్ నక్షత్ర.. న్యూట్విస్ట్, కనిపించని భర్త-ప్రియురాలు.. వెనుక ఆ నేత?

Miss Vizag Nakshatra shocking issues reveals: మిస్ వైజాగ్ నక్షత్ర.. న్యూట్విస్ట్, కనిపించని భర్త-ప్రియురాలు.. వెనుక ఆ నేత?

Visakha Miss Vizag Nakshatra shocking issues reveals: మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలను బయట పెట్టిందామె. భర్త వెంకటసాయి తేజ- ప్రియురాలు వంశీ కనిపించలేదని ఆరోపించారు. అంతేకాదు దీనికి వెనుక రాజకీయ నేత ఉన్నారని కుండబద్దలు కొట్టేశారు. ఇంతకీ ఆ నేత ఎవరు? అందుకు తనకు న్యాయం జరగలేదని ఆరోపించారామె. అసలే ఏం జరుగుతోంది?


శుక్రవారం ఉదయం ఓ ఛానెల్‌తో మాట్లాడిన నక్షత్ర, తన భర్త, ప్రియురాలు మిస్సింగ్‌ వెనుక ఒక రాజకీయ నేత ఉన్నారని ఆరోపించారు. తన భర్త ప్రియురాలి పేరు వంశీ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు సొంతూరు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అని వెల్లడించారు. ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తని తెలిపింది. అందువల్లే తనకు న్యాయం జరగలేదన్నది నక్షత్ర మాట.

గురువారం ఇష్యూ తర్వాత తన భర్త సాయితేజ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించింది నక్షత్ర. రాజకీయ పలుకుబడి ఉండడం వల్లే తనకు అన్యాయం జరుగుతోందని వాపోయింది. తన భర్త-వంశీ కలిసే ఉన్నారని అంటోంది నక్షత్ర. సాయంత్రం పోలీసులు సాయి తేజ, ఆమె ప్రియురాలిని ఇక్కడ నుంచి తీసుకెళ్లారని తెలిపింది. తాను స్టేషన్‌కు వెళ్లి అడిగితే ఇక్కడకు ఎవరు రాలేదని అంటున్నారని వాపోయింది.


ALSO READ: మిస్ వైజాగ్ నక్షత్ర, ఇంటి పోరు.. భర్త ఇంటి వద్ద ఆందోళన

గురువారం తెలుగు ఛానెళ్లలో మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర వ్యవహరం తీవ్రదుమారం రేపింది. ఈ నేపథ్యంలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నక్షత్ర తనను నాలుగేళ్లగా డబ్బుల కోసం వేధిస్తోంద ని ఆరోపించాడు ఆమె భర్త. తాము విడిపోయిన నాలుగేళ్లు అవుతుందన్నాడు. మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందన్నది వెంకటసాయి తేజ. త్వరలో ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పు కొచ్చాడు. దీనిపై పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటారా? రానున్న రోజుల్లో నక్షత్ర ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

 

 

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×