Passengers Beat Railway Employee To Death| కొందరు రైలు ప్రయాణికులు ఒక రైల్వే ఉద్యోగిని గంటల తరబడి చితకబాదారు. దీంతో ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన బిహార్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ ప్రయాణిస్తున్న ట్రైన్ లో జరిగింది. ప్రస్తుతం ఆ ప్రయాణికులపై బాధితుడి కుటుంబం హత్య కేసు పెట్టింది.
పోలీసుల కథనం ప్రకారం .. బుధవారం, సెప్టెంబర్ 11 ,2024న బిహార్ లోని బరౌనీ పట్టణంలో నివసించే ఒక కుటుంబ సభ్యలు.. బిహార్ సివాన్ నగరం నుంచి ఢిల్లీకి వెళ్లే ‘హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్’ ట్రైన్ లో ప్రయాణిస్తుండగా.. అదే ట్రైన్ లో రైల్వే గ్రూప్ డి ఉద్యోగి ప్రశాంత్ కుమార్ కూడా ప్రయాణిస్తున్నాడు. వారంతా ఏసీ త్రీ టైర్ ఎకానమీ కోచ్ M1లో జర్నీ చేస్తున్నారు.
బరైనీ నుంచి ప్రయాణం చేస్తున్న కుటుంబంలో 11 ఏళ్ల అమ్మాయి, ఆమె తల్లి, తండ్రి తాత ఉన్నారు. అయితే రాత్రి 11.30 గంటలకు అందరూ నిద్రపోతుండగా.. పాప తల్లి బాత్ రూమ్ కు వెళ్లింది. ఆ సమయంలో పాప నిద్ర పోకుండా కూర్చొని ఉంది. అది చూసిన రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ ఆ పాపను తన పక్కన కూర్చోవడానికి పిలిచాడు.. పాప అందుకు అంగీకరించపోయేసరికి బలవంతంగా పట్టుకొని లాగి తనను అసభ్యంగా పట్టుకుని అభ్యంతరకంగా గట్టిగా మర్మాంగాల వద్ద నలిపాడు. పాప గట్టిగా అరవకుండా నోరు మూసేశాడు. కాసేపు తరువాత ఎవరో వస్తున్నట్లు చప్పుడు కాగా.. వదిలేశాడు.
Also Read: ఇకపై రైలు ప్రయాణంలోనూ మీకిష్టమైన ఆహారం.. ట్రైన్ లో జొమాటో డెలివరీ!
పాప తల్లి బాత్ రూమ్ నుంచి రాగానే ఆమెను పాప బాత్ రూమ్ వద్దకు తీసుకెళ్లి జరిగినదంతా వివరించింది. పాప తల్లి ఇదంతా తన భర్త, మామ (భర్త తండ్రికి) తెలిపింది. దీంతో వారంతా కలిసి ప్రశాంత్ కుమార్ ను పట్టుకొని కొట్టారు. అంతటితో ట్రైన్ లఖ్ నవు లోని అలిబాగ్ జంక్షన్ చేరుకున్నప్పుడు.. ప్రశాంత్ కుమార్ ని ట్రైన్ డోర్ వద్దకు తీసుకుపోయి కట్టేసి కొట్టారు. అలా చాలా సేపు వరకు అతడిని చితకబాదుతూనే ఉన్నారు. అలా ట్రైన్ కాన్పూర్ సెంట్రల్ స్టేషన్ చేరే వరకు కొట్టారు.
అలీబాగ్ నుంచి కాన్పూర్ సెంట్రల్ స్టేషన్ గంటన్నర దూరంలో ఉంది. గురువారం ఉదయం 4.30 గంటలకు ట్రైన్ కాన్పూర్ సెంట్రల్ స్టేషన్ వద్ద చాలా సేపు ఆగింది. దీంతో అక్కడ రైల్వే పోలీసులు గాయాలతో కింద పడి ఉన్న ప్రశాంత్ కుమార్ ని చూసి ఆస్పత్రికి తరలించారు. ప్రశాంత్ ని కొట్టిన కుటుంబ సభ్యులకు పోలీసులకు జరిగినదంతా వివరించారు. అయితే ఆస్పత్రికి చేరిన కాసేపు తరువాతనే ప్రశాంత్ కుమార్ మరణించాడని డాక్టర్లు తెలిపారు. చనిపోయే ముందు ప్రశాంత్ కుమాన్ తనను ఒక ఫ్యామిలీ అంతా కలిసి కొట్టిందని పోలీసులకు తెలిపాడు.
Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..
ఒక వైపు ప్రశాంత్ కుమార్ పై ఆ కుటుంబ సభ్యులు పాప పై లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు చేయగా.. మరోవైపు ప్రశాంత్ కుమార్ కుటుంబ సభ్యులు వారిపై హత్య కేసు నమోదు చేయించారు. ప్రశాంత్ కుమార్ బిహార్ లోని ముజఫర్ పూర్ జిల్లా సమస్తపూర్ గ్రామానికి చెందిన వాడు. అతని కుటుంబ సభ్యులు ప్రశాంత్ అమాయకుడని అతడిని కుట్ర చేసి హత్య చేశారని చెబుతున్నారు. గంటల తరబడి ట్రైన్ లో ప్రశాంత్ దారుణంగా కొట్టడంతో అక్కడ రైల్వే పోలీసులకు తెలియకుండా ఎలా ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.