TDP On Tuni Incident: తూర్పుగోదావరి జిల్లా తునిలో 8వ తరగతి బాలికపై నారాయణ రావు అనే వృద్ధుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై టీడీపీ స్పందించింది. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిదని అభిప్రాయపడింది. ఇటువంటి చర్యలను కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసింది. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుందని పేర్కొంది. టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలో కూడా నిందితుడికి ఏ పదవీ లేదని స్పష్టం చేసింది.
తప్పు చేస్తే నాయకులకైనా, సామాన్యులకైనా ఒకే శిక్షలు ఉంటాయని టీడీపీ ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. ఇప్పటికే నిందితుడిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండుకు పంపుతున్నారు. కఠినమైన శిక్షలు పడేలా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు.
తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తనను షాక్ కు గురిచేసిందని మంత్రి లోకేశ్ ఎక్స్ వేదిక పోస్టు పెట్టారు. ఈ ఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే వాడెవరైనా ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి, అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు.
తూర్పు గోదావరి జిల్లా తునిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బాలికపై అత్యాచారం చేశాడని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హంసవరం ప్రాంతానికి చెందిన నారాయణరావు అనే వృద్ధుడు, తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక తాత అని చెప్పి హస్టల్ నుండి బాలికను బయటకు తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హంసవరం సమీపంలోని సపోటా తోటల్లో బాలికతో ఉన్న వృద్ధుడిని పట్టుకోగా.. తాను టీడీపీకి చెందిన వాడినని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కూడా బాలికను బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Also Read: Tuni Incident: తోటలో తాత తీట పనులు.. మైనర్ బాలికపై అఘాయిత్యం? నిందితుడు టీడీపీ నేత?