BigTV English

Realme C65 Price: రియల్ మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్.. ప్రైజ్‌పై ఓ లుక్కేయండి!

Realme C65 Price: రియల్ మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్.. ప్రైజ్‌పై ఓ లుక్కేయండి!

Realme C65 Price: దేశంలో స్మార్ట్​ఫోన్స్​ మార్కెట్​లోని బడ్జెట్​ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్​కి మంచి డిమాండ్​ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే.. స్మార్ట్​ఫోన్​ కంపెనీలు కూడా పోటీపడి మరీ కొత్త కొత్త డివైజ్​లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ను కంపెనీ సి-సిరీస్ కింద మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ వియత్నాంలో విడుదల చేసింది. ఇది త్వరలో భారత మార్కెట్‌లోకి కూడా వచ్చే అవకాశం ఉంది. దీని ధర రూ.10 వేలుగా ఉండవచ్చు. Realme కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Realme C65ని మూడు RAM, స్టోరేజ్ వేరియంట్‌లలో తీసుకొచ్చింది.  ఈ ఫోన్ ధర, ఫీచర్లు గురించి తెలుసుకోండి.


Realme C65 ధర

వియత్నాంలో లాంచ్ చేసిన ధరల ప్రకారం.. దీని 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,000గా ఉంది. 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర  రూ. 14,000, 8GB/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,000. ఈ ఫోన్‌ను రెండు కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. బ్లాక్ మిల్కీ వే, పర్పుల్ నెబ్యులా.


Also Read : బంపర్ ఆఫర్.. ఐఫోన్ మినిపై రూ. 50 వేల వరకిడిస్కౌంట్.. కేవలం రూ. 9,990కే మీ సొంతం

Realme C65
Realme C65

Realme C65 ఫీచర్లు

ఇది 625 nits బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో 6.67 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ బడ్జెట్ ఫోన్‌లో మీకు 12nm MediaTek Helio G85 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది 8GB RAM+8GB వరకు వర్చువల్ RAM మద్దతుతో లభిస్తుంది. ఇది కాకుండా ఫోన్‌లో 256GB వరకు స్టేరేజ్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ 2 TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.  ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. Android 14 ఆధారిత Realme UI 5.0 పై పని చేస్తుంది.

Also Read: రూ.8వేల boAt స్మార్ట్ వాచ్ రూ.999కే..!

కెమెరా

ఈ Realme C65 స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా కలిగి ఉంది. ఇది AI- పవర్డ్ లెన్స్‌తో అమర్చబడి ఉంటుంది. సెల్ఫీలు, వీడియోల కోసం ఇది 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5000mAh బ్యాటరీ పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం మీరు Wi-Fi, USB టైప్-C పోర్ట్, బ్లూటూత్ 5.3, GPS, A-GPS, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ IP-54 రేటింగ్‌తో వస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. మీరు తక్కువ ధరలో మంచి ఫీచర్లతో  కొత్త హ్యాండ్‌సెట్‌ను తీసుకోవాలని భావిస్తుంటే ఈ ఫోన్ మంచి ఆప్షన్‌గా ఉంటుంది.

Related News

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం కష్టం.. iFixitలో తక్కువ స్కోరు

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Internet: ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఒకసారి అలా వెళ్లొద్దాం రండి..

Amazon Freedom Festival Laptops: రూ.1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Windows 10 Support Ends: విండోస్ 10 సపోర్ట్ త్వరలోనే ముగింపు.. సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇలా పొందాలి

Big Stories

×