BigTV English

Krishnamma: టాలెంటడ్ హీరో.. ఈసారి కృష్ణమ్మ తో వస్తున్నాడు

Krishnamma: టాలెంటడ్ హీరో.. ఈసారి కృష్ణమ్మ తో వస్తున్నాడు


Krishnamma: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన సత్యదేవ్ హీరోగా మారి మంచి సినిమాల్లో నటించాడు. ఇక ఈ మధ్య కొంత జోరు తగ్గించిన ఈ హీరో.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం సత్యదేవ్ నటిస్తున్న చిత్రం కృష్ణమ్మ. వివి గోపాల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తుండగా.. డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్నాడు. దేవర సినిమా కన్నా ఈ సినిమానే రిలీజ్ కు రెడీ అవుతోంది. కొరటాల కథ నచ్చితేనే ఏ సినిమా అయినా  ఓకే చేస్తాడు. అలాంటిది ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాడు అంటే కచ్చితంగా ఇందులో విషయం ఉందని అభిమానులు నమ్ముతున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగాఆకట్టుకున్నాయి. భద్ర అనే పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. సమ్మర్ కానుకగా మే 3 న ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ విషయాన్నీ సత్యదేవ్ కూడా ట్విట్టర్ వేదికగా  తెలుపుతూ.. మే 3 న కృష్ణమ్మ వస్తుంది.. ఈ సినిమా మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది అని రాసుకొచ్చాడు.


ఇక రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియోలో .. సత్యదేవ్ జైల్లో ఉన్నట్లు కనిపించాడు. అంతేకాకుండా అతడిని పోలీసులు టార్చర్ చేసింది కూడా చూపించారు. అసలు కృష్ణమ్మ ఎవరు.. ? ఎందుకు భద్రను పోలీసులు జైల్లో పెట్టారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రంలో సత్యదేవ్ సరసన అతిర రాజి నటిస్తుండగా.. కీరవాణి కొడుకు కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ సినిమాతో సత్యదేవ్ తోపాటు  కొరటాల కూడా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×