BigTV English
Advertisement

NTR: ఒక ఫ్రేమ్ లో దేవర, కాంతార.. అదిరిపోయారు

NTR: ఒక ఫ్రేమ్ లో దేవర, కాంతార.. అదిరిపోయారు

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దేవర సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకోగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ దృష్టి అంతా డ్రాగన్ మీదనే ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.


ఇకపోతే ఈ సినిమా కన్నా ముందు ఎన్టీఆర్.. బాలీవుడ్ లో వార్ 2 ను ముగిస్తున్నాడు. ఈ మధ్యనే ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. సలార్ తరువాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో మరింత హైప్ పెరిగింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్.. మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు ఎన్టీఆర్ తల్లి షాలిని కూడా ఎయిర్ పోర్టులో కనిపించారు.

ఇక ఇదే ఎయిర్ పోర్ట్ లో అనుకోకుండా దేవరను కలిశాడు కాంతార. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో కలిసినట్లు తెలుస్తోంది.. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. రిషబ్ శెట్టి జాతీయ అవార్డు గెలుచుకున్న విషయం తెల్సిందే. అప్పుడే ఎన్టీఆర్.. రిషబ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన విషయం తెల్సిందే.


ఇక ఇప్పుడు కలవడంతో మరోసారి రిషబ్ కు ఎన్టీఆర్ కంగ్రాట్స్ చెప్పినట్లు తెలుస్తోంది. సంప్రదాయబద్ధంగా రిషబ్ కనిపించగా.. క్యాజువల్ లుక్ లో ఎన్టీఆర్ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దేవర, కాంతార ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వీరిద్దరూ ఎయిర్ పోర్ట్ లో కలిస్తేనే ఇలా ఉందంటే.. ఒక సినిమాలో కనిపిస్తే బాక్సాఫీస్ బద్దలు అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అలాంటి ఒకరోజు వస్తుందేమో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×