E-Paper
Advertisement

Samsung మెగా సేల్ షురూ.. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్లపై రూ.20వేల క్యాష్‌బ్యాక్‌, రూ.99కే మూడేళ్ల వారంటీ!

Samsung మెగా సేల్ షురూ.. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్లపై రూ.20వేల క్యాష్‌బ్యాక్‌, రూ.99కే మూడేళ్ల వారంటీ!
Advertisement

Big Bespoke AI Fest: కొత్త ఇంట్లోకి ఒకేసారి అన్ని హోమ్ అప్లయన్సెస్ కొనాలనుకునే వారికి శాంసంగ్ గుడ్ న్యూస్ చెప్పింది. ‘బిగ్ బెస్పోక్ AI ఫెస్ట్’ పేరుతో సరికొత్త సేల్‌ను తీసుకొచ్చింది. జూన్ 12 నుంచి జులై 19 వరకు అందుబాటులో ఉండే ఈ సేల్‌లో భాగంగా రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లతో పాటు అనేక రకాల ప్రీమియం స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్‌పై కంపెనీ భారీ ఆఫర్లను ప్రకటించింది.

క్యాష్‌బ్యాక్, ఫైనాన్స్ ఆఫర్లు:

ఈ ఫెస్ట్‌లో భాగంగా శాంసంగ్ ఎంపిక చేసిన బెస్పోక్ AI అప్లయన్సెస్‌పై రూ.20వేల వరకు భారీ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. స్మార్ట్‌థింగ్స్, బిక్స్‌బీ AI సపోర్ట్‌తో వచ్చే ఈ ప్రీమియం ప్రొడక్ట్స్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీనికి తోడు శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లు అదనంగా రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

Advertisement

Also Read: YouTubeను సోషల్ మీడియాగా మార్చే భారీ ప్లాన్.. ఇక యాప్‌లోనే చాటింగ్, వీడియో షేరింగ్!

వారంటీ, స్పెషల్ బెనిఫిట్స్:

ఈ సేల్‌లో భాగంగా రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు కొనేవారికి శాంం‌సంగ్ కేర్ ప్లస్ ద్వారా అద్భుతమైన ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. దీంతో ఏడాది వారంటీకి డబ్బులు చెల్లిస్తే.. మరో రెండేళ్ల వారంటీ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. అలాగే సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్లు కొనేవారికి కేవలం రూ.99కే ఒక ఏడాది అదనపు వారంటీ ఇస్తున్నారు. కొన్ని ఎంపిక చేసిన టాప్‌లోడ్ వాషింగ్ మెషీన్లపై దుమ్ము, తుప్పు పట్టకుండా రక్షించే ఉచిత ఫిల్టర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

ఏసీలపై ఐదేళ్ల సమగ్ర వారంటీ:

Advertisement

కొత్త ఏసీ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. బెస్పోక్ AI ఎయిర్ కండిషనర్లపై శాంసంగ్ ఏకంగా 5 ఏళ్ల కాంప్రహెన్సివ్ వారంటీని ఇస్తోంది. ఇవి AI కూలింగ్ టెక్నాలజీతో పనిచేస్తాయి. అంతేకాదు.. స్మార్ట్‌థింగ్స్ హోమ్ కేర్ ఫీచర్ ద్వారా ఏసీ పనితీరును గమనిస్తూ, ఫిల్టర్ క్లీనింగ్ ఎప్పుడు చేయాలో, ఏవైనా సమస్యలు ఉంటే ముందే యూజర్లను అలర్ట్ చేస్తాయి.

ఎక్కడ కొనాలంటే?

శాంసంగ్ బెస్పోక్ AI రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు అన్నీ లేటెస్ట్ టెక్నాలజీతో, విద్యుత్ ఆదా చేసేలా డిజైన్ చేశారు. ఈ ఆకర్షణీయమైన ఆఫర్లను కస్టమర్లు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్‌లతో పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా పొందవచ్చు.

Also Read: ఈ వానలకు వేడి వేడి ఫ్రైలు తినాలనిపిస్తుందా? అయితే ఈ Air Fryers మీ కిచెన్‌లో ఉండాల్సిందే!

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×