SAMSUNG Galaxy F15 5G at Rs 799 Only: బడ్జెట్ ధరలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే అధిక ధర కారణంగా కొనలేక మీ ప్లాన్‌ను మార్చుకుంటున్నారా?.. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే అతి తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు ఈజీగా కొనుక్కోవచ్చు. అదెలా అనుకుంటున్నారా? అయితే రండి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భలే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 15 5జీ(SAMSUNG Galaxy F15 5G) స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అందించే డిస్కౌంట్‌తో అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు కలర్‌లు.. రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
అందులో 4జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ అసలు ధర రూ.15,999గా ఉంది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దీనిపై 18శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.12,999లకే లిస్ట్ అయింది. అలాగే 6 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.16,999గా ఉంది. దీనిని 14 శాతం డిస్కౌంట్‌తో రూ.14,499లకే కొనుక్కోవచ్చు.
Also Read: బంపరాఫర్.. రూ.10,500 ఫోన్‌పై రూ.10వేల డిస్కౌంట్..!
అంతేకాకుండా వీటిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్ ఈఎంఐ, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్లపై రూ.1000 వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అప్పుడు మరింత తక్కువ ధరకే దీనిని కొనుక్కోవచ్చు.
అయితే ఇవి కాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 4/128 జీబీ వేరియంట్‌పై ఏకంగా రూ.12,200 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌తో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ని కేవలం రూ.799లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే 6/128జీబీ వేరియంట్‌పై రూ.13,550 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడు దీనిని రూ.949లకే సొంతం చేసుకోవచ్చు.
Also Read: Ac Offers: ష్.. బాగా ఉక్కపోస్తుందా.. సగం ధరకే ఈ ఏసీని కొనేయండి మావా..!
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ భారీ మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే.. పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటా డ్యామేజ్ ఉండకూడదు. మోడల్ బట్టి ధర మారుతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను భారీ మొత్తంలో పొందుతారు. లేకపోతే మరింత డబ్బును మీ జేబులోంచి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ భారీ మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే.. 4/128జీబీ వేరియంట్‌ను అత్యంత చీప్ కాస్ట్‌కే కొనుక్కోవచ్చు.