Samsung Galaxy Fit 4: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త ఫిట్‌నెస్ ట్రాకర్‌గా గెలాక్సీ ఫిట్ 4 త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. ఈ డివైజ్‌కు సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. గెలాక్సీ ఫిట్ 4 మేనేజర్ యాప్‌ను పరిశీలించగా కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్‌లో ఉండే ఫీచర్లు, డిస్‌ప్లే, కలర్స్ గురించి సమాచారం తెలిసినట్లు Sammyguru తెలిపింది. గతంలో వచ్చిన గెలాక్సీ ఫిట్ 3తో పోలిస్తే.. ఇందులో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.
Galaxy Fit 4లో గత మోడల్ కంటే కొంచెం పొడవైన డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. యాప్‌లో కనిపించిన వాచ్ ఫేస్ చిత్రాల రిజల్యూషన్ 258 x 428 పిక్సెల్స్‌గా ఉంది. దీన్ని బట్టి స్క్రీన్‌లో స్వల్ప మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఫిట్‌నెస్ ట్రాకర్ బ్లాక్, సిల్వర్, లైట్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులోకి రావచ్చని అంచనా.
Also Read: రూ.15 వేల బడ్జెట్‌లో ఇంత మంచి ఫోన్స్ దొరుకుతాయా? ఈ ఐదు మోడల్స్‌లో ఏది బెస్ట్ అంటే?
Galaxy Fit 4లో గరిష్టంగా 12 టైల్స్‌ను యాడ్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. వీటి ద్వారా అవసరమైన ఫీచర్లను త్వరగా ఓపెన్ చేయవచ్చు. ఫోన్‌ను ఎక్కడైనా పెట్టి మర్చిపోతే.. బ్యాండ్ నుంచే రింగ్ చేసే Find My Phone ఆప్షన్ కూడా ఉండొచ్చని సమాచారం. నోటిఫికేషన్లు ఫోన్‌లో, బ్యాండ్‌లో ఎలా కనిపించాలో ఎంచుకునే సెట్టింగ్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
ఈ బ్యాండ్‌లో స్టెప్స్, యాక్టివ్ టైమ్, కేలరీల లెక్కింపు వంటి ఫీచర్లు ఉండొచ్చు. హార్ట్‌రేట్, స్ట్రెస్, నిద్ర వివరాలు, స్లీప్ స్టేజెస్, స్లీప్ స్కోర్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు. బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, నిద్రలో గురకను గుర్తించే ఫీచర్లు కూడా యాప్‌లో కనిపించినట్లు సమాచారం. వర్కౌట్ ట్రాకింగ్, ఆటోమేటిక్ యాక్టివిటీ గుర్తింపు, శ్వాస వ్యాయామాలు, పీరియడ్స్ ట్రాకింగ్, నీరు, ఆహారం వివరాలు నమోదు చేసే ఆప్షన్లు కూడా ఉండొచ్చు.
ప్రస్తుత సమాచారం ప్రకారం యాప్‌లో జీపీఎస్‌కు సంబంధించిన వివరాలు కనిపించలేదు. అయితే, దీనివల్ల జీపీఎస్ అసలు ఉండదని ఇప్పుడే చెప్పలేం. వ్యాయామ వివరాలను Samsung Health యాప్‌తో సింక్ చేసుకునే అవకాశం ఉంది. గెలాక్సీ ఫిట్ 4 ధర, లాంచ్ తేదీపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. భారత్‌లో గెలాక్సీ ఫిట్ 3 ఫిబ్రవరి 2024లో రూ.4,999 ధరతో లాంచ్ అయింది. కొత్త మోడల్ ధర కూడా అధికారిక ప్రకటన తర్వాతే తెలుస్తుంది.
Also Read: ఏఐ మోడల్స్‌లో తప్పులను గుర్తించేందుకు OpenAI కొత్త సేఫ్టీ సిస్టమ్.. 4 లేయర్లతో నిఘా!