E-Paper
Advertisement

కొత్త లుక్‌లో హీరో డెస్టిని 110.. క్లాసిక్ ఎడిషన్ ధర ఎంతంటే?

కొత్త లుక్‌లో హీరో డెస్టిని 110.. క్లాసిక్ ఎడిషన్ ధర ఎంతంటే?
Advertisement

Hero Destini 110 Classic Edition: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ డెస్టిని 110 స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనికి డెస్టిని 110 క్లాసిక్ ఎడిషన్ అని పేరు పెట్టింది. ఈ కొత్త ఎడిషన్ ధరను రూ.76,400గా నిర్ణయించింది. ఇప్పటికే పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త మోడళ్లను పరిచయం చేస్తున్న కంపెనీ, ఈ స్కూటర్‌లో స్పెషల్ కలర్స్, ఆకట్టు డిజైన్ ను తీసుకొచ్చింది. ఇంజిన్, పనితీరులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

బేస్ VX వేరియంట్ ఆధారంగా కొత్త ఎడిషన్

హీరో డెస్టిని 110ను తొలిసారిగా 2025లో భారత మార్కెట్లో విడుదల చేసింది. జూమ్ 110, ప్లెజర్+ ఎక్స్‌ టెక్ తర్వాత కంపెనీ నుంచి వచ్చిన మరో 110cc స్కూటర్ ఇది. ప్రస్తుతం డెస్టిని 110 VX, ZX అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కొత్త క్లాసిక్ ఎడిషన్‌ను బేస్ VX వేరియంట్ ఆధారంగా రూపొందించారు. దీని ధర రూ.76,400. సాధారణ VX వేరియంట్‌తో పోలిస్తే ఇది రూ.1,400 ఎక్కువ. టాప్ ఎండ్ ZX వేరియంట్ ధర రూ.83,800గా ఉంది. అయితే ZX వేరియంట్ ప్రస్తుతం హీరో వెబ్‌సైట్‌లో బ్లూ కలర్‌లో మాత్రమే కనిపిస్తోంది.

మూడు స్పెషల్ కలర్ ఆప్షన్లు

Advertisement

డెస్టిని 110 క్లాసిక్ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ దాని కొత్త స్టైలింగ్. ఈ స్కూటర్‌ ను మూడు ప్రత్యేకమైన రంగుల్లో అందిస్తున్నారు. సిల్వర్, గ్రే రంగులకు బ్రౌన్ కలర్ ఇన్నర్ ప్యానెల్స్ ఇచ్చారు. బ్రౌన్ కలర్ మోడల్‌లో మాత్రం కాంట్రాస్టింగ్ బ్లాక్ ఇన్నర్ ప్యానెల్స్ ఉంటాయి. వీటితో పాటు కలర్‌కు సరిపోయే మిర్రర్లు, ప్రత్యేకమైన 3D ఎంబ్లమ్, స్కూటర్ పక్క భాగాల్లో కొత్త స్ట్రైప్స్ అందించారు. ఈ ఛేంజెస్ స్కూటర్‌ కు క్లాసిక్ లుక్‌ను తీసుకొస్తున్నాయి. సాధారణ వేరియంట్‌ తో పోలిస్తే ప్రత్యేకమైన రూపాన్ని కోరుకునే కస్టమర్లను ఆకర్షించడమే కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇంజిన్, పనితీరులో నో ఛేంజెస్

ఈ కొత్త ఎడిషన్‌లో కూడా అదే 110.9cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఇది 7,250rpm దగ్గర 8.2hp పవర్, 5,750rpm దగ్గర 8.7Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ యాడ్ చేశారు. ముందు, వెనుక రెండు వైపులా 12 అంగుళాల వీల్స్ ఉన్నాయి. అయితే, VX వేరియంట్ ఆధారంగా రూపొందించినందున ముందు భాగంలో డ్రమ్ బ్రేక్‌ను అందించారు. ZX వేరియంట్‌లో ఉండే డిస్క్ బ్రేక్ ఇందులో లేదు.

షోరూమ్‌లలో అందుబాటులోకి..

Advertisement

హీరో డెస్టిని 110 క్లాసిక్ ఎడిషన్ ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ అయింది. దేశవ్యాప్తంగా ఉన్న హీరో షోరూమ్‌లలో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది. మొత్తంగా చూస్తే, ఇంజిన్, ఫీచర్లలో పెద్ద మార్పులు లేకుండా కొత్త రంగులు, డిజైన్‌తో ప్రత్యేకమైన రూపాన్ని కోరుకునే కస్టమర్ల కోసం హీరో ఈ క్లాసిక్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది.

Read Also: ఈవీ మార్కెట్‌లో హీరో విడా దూకుడు.. 2026లో 2 లక్షలు దాటిన అమ్మకాలు!

Tags

Related News

దక్షిణాఫ్రికాలో టాటా పంచ్ రిలీజ్.. భారత్‌తో పోలిస్తే ధర ఎక్కువా? తక్కువా?

ఈవీ మార్కెట్‌లో హీరో విడా దూకుడు.. 2026లో 2 లక్షలు దాటిన అమ్మకాలు!

దీపావళి స్పెషల్ ఆఫర్స్.. ఈ 5 సెడాన్ కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు!

దీపావళి సీజన్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు.. ఈ 5 కార్లపై లక్షల్లో తగ్గింపు!

బజాజ్ చేతక్‌ కు భారీ డిమాండ్.. ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ బిగ్ ప్లాన్!

సింగిల్ ఛార్జ్ తో 355 కి.మీ రేంజ్‌.. హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ SUV!

బజాజ్ ఆటో బిగ్ ప్లాన్.. మార్కెట్లోకి మరో రెండు కొత్త బైక్ బ్రాండ్లు!

Big Stories

Advertisement
×