BigTV English

Samsung Galaxy M34 5G: రూ.999లకే 6జీబీ ర్యామ్, 50MP కెమెరా, 6000 mAH బ్యాటరీ గల సామ్‌సంగ్‌ ఫోన్‌.. లిమిటెడ్ ఆఫర్

Samsung Galaxy M34 5G: రూ.999లకే 6జీబీ ర్యామ్, 50MP కెమెరా, 6000 mAH బ్యాటరీ గల సామ్‌సంగ్‌ ఫోన్‌.. లిమిటెడ్ ఆఫర్

Buy Samsung Galaxy M34 5G Mobile at Rs 999 Only: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సామ్‌సంగ్‌కు మార్కెట్‌లో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈ కంపెనీ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే.. కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు ఫోన్ ప్రియులు. ఇక ఇప్పుడు దేశ వ్యాప్తంగా 5జీ మయమైపోవడంతో ఈ కంపెనీ నుంచి వస్తున్న కొత్త ఫోన్ల ధరలు పెరిగిపోయాయి. అయితే ఎప్పట్నుంచో సామ్‌సంగ్ కంపెనీకి చెందిన 5జీ ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్. ఎందుకంటే 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన 5జీ ఫోన్‌ను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో Samsung Galaxy M34 5G 6GB/128GB వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా పలు బ్యాంక్ ఆఫర్లతో ఈ మొబైల్‌ని మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అమెజాన్‌లో Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.24,449 ఉండగా.. ఇప్పుడు 47 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.12,999లకే లిస్ట్ అయింది. దీని బట్టి చూస్తే సగం ధరకే అని చెప్పుకోవచ్చు.

అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. Canara Bank Credit కార్డు నాన్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.500 డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే HSBC Credit Card ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.2500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ డిస్కౌంట్‌తో ఇప్పుడు రూ.10,499లకే సొంతం చేసుకోవచ్చు. ఇది కాకుండా రూ.12000 భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. అయితే ఈ ఆఫర్ మొత్తం వర్తిస్తే మాత్రం Samsung Galaxy M34 5G ఫోన్‌ను కేవలం రూ.999లకే కొనుక్కొని ఇంటికి తీసుకెళ్లొచ్చు.


Also Read: 8GB RAM, 50MP కెమెరా, 5500 mAh బ్యాటరీ వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

అయితే ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే.. పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్, హ్యాంగింగ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇంతమొత్తంలో డిస్కౌంట్ పొందుతారు. లేకపోతే మరింత అమౌంట్‌ను మీ జేబులోంచి పెట్టాల్సి ఉంటుంది.

Samsung Galaxy M34 5G Specifications

ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల Super AMOLED Display తో వస్తుంది. 120Hz అధిక రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ గరిష్ట ప్రకాశం 1,000 నిట్‌ల వరకు ఉంటుంది. ఈ ఫోన్ Exynos 1280 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13పై ఆధారపడి పని చేస్తుంది. ఇందులో 50MP ప్రధాన OIS కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే ఇది సెల్ఫీలు, వీడియో కాన్ఫరెన్సింగ్, కాలింగ్ కోసం 13MP కెమెరా షూటర్‌ను కలిగి ఉంది. అలాగే 6000mAH Lithium-ion batteryతో వస్తుంది.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×