BigTV English

Helicopter Emergency Landing: కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్‌కు తప్పిన పెను ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో భక్తులు..!

Helicopter Emergency Landing: కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్‌కు తప్పిన పెను ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో భక్తులు..!

Helicopter Emergency Landing at Kedarnath: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ఓ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. అది ల్యాండ్ అయ్యేవరకు భక్తులు భయంతో హడలిపోయారు. అసలేం జరిగిందంటే.. జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్‌నాథ్‌లో ఏడుగురు భక్తులతో బయలుదేరింది ఓ హెలికాఫ్టర్. అయితే హెలిపాడ్ దగ్గర కొచ్చేసరికి ల్యాండింగ్ కాకుండా కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.


ఈ సమయంలో అక్కడున్న భక్తులు భయంతో పరుగులుపెట్టారు. హెలికాప్టర్ లోపల ఉన్నవారు తమకు కాపాడాలంటూ దేవుని ప్రార్థించారు. ఈ క్రమంలో హెలిప్యాడ్‌కు కొన్ని మీటర్ల దూరంలో సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అందులోని భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ఏడుగురు భక్తులతోపాటు పైలట్ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా జరిగిందని చెప్పుకొచ్చారు. కాకపోతే హెలికాప్టర్ చుక్కాని దెబ్బతిన్నట్లు సమాచారం. చివరకు పైలట్‌కు కృతజ్ఞత చెప్పారు భక్తులు. కేదార్‌నాథ్‌లో ఈ తరహా ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. 11 ఏళ్లలో 10 ప్రమాదాలు జరిగాయి. అందుకే అక్కడ సీనియర్ పైలట్‌ను విధుల్లోకి తీసుకుంటారు.


Also Read: Blast in Gunpowder Factory : ఛత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి

రెండు వారాల కిందట చార్‌ధామ్ యాత్ర మొదలైంది. రోజుకు 25 వేల మంది భక్తులు అక్కడికి వస్తుంటారు. అక్కడి నుంచి భక్తులను ధామ్ వద్దకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్లు తిరుగుతుంటాయి. అయితే శుక్రవారం ఉదయం ఏడు గంటల సమయంలో చాపర్‌కు సాంకేతిక లోపం ఏర్పడిందని అంటున్నారు. దీంతో హెలిపాడ్‌కు 100 మీటర్ల ముందు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సివచ్చింది.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×