Samsung Galaxy M35 Launched with 6,000mAh Battery: స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా Samsung Galaxy M35 5G ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. అలాగే ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కాగా ఇప్పుడు ఈ Galaxy M35 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ధర మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy M35 5G Specifications
Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 nits పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌తో అమర్చబడి ఉంది. ఇది 4x మెరుగైన స్క్రాచ్ రెసిస్టెన్స్, 2.0 మీటర్ల ఫాల్ ఎండ్యూరెన్స్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. Galaxy M35లో in-house Exynos 1380 SoC ప్రాసెసర్ ఉంది.
స్టోరేజ్ విషయానికొస్తే.. ఇది 8GB RAM + 256GB ఇంబిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో OIS మద్దతుతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. దీని ముందు భాగంలో 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది. Galaxy M35 Android 14 ఆధారంగా One UI 6.1లో పని చేస్తుంది. కంపెనీ 4 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 5 సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
Also Read: శాంసంగ్ నుంచి తోపు ఫోన్.. ఫీచర్లు వేరే లెవెల్.. లాంచ్ ఎప్పుడంటే..?
Samsung Galaxy M35 5G Price
Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. అందులో 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా, 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో జూలై 20, 21 తేదీల్లో జరిగే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో సేల్‌కి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూన్‌లైట్ బ్లూ, డేబ్రేక్ బ్లూ, థండర్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.