BigTV English

Three new airports in AP: ఏపీలో మూడు చోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే?

Three new airports in AP: ఏపీలో మూడు చోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే?

Three New Airports Planned in AP: ఏపీ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి శుభవార్త చెప్పారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని ఆమె చెప్పారు. రాష్ట్రంలో మూడు చోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లాలోని కుప్పుం, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోని మూలపేటలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయగలుగుతున్నామని ఆమె తెలిపారు. అభివృద్ధి, కనెక్టివిటీతోపాటు ఆర్థిక పురోగతికి కూడా ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.


మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చిన్న ఎయిర్ పోర్టులు తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం ఎయిర్ పోర్టు పనుల్లో వేగం పెరిగిందన్నారు. కాగా, సీఎం చంద్రబాబు ఇటీవలే అక్కడికి వెళ్లి జరుగుతున్న పనులను పరిశీలించిన విషయం తెలిసిందే.


Tags

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×