Jobs Notifications: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు అయితే ఇది మంచి అవకాశం.
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(REC)లోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 74
ఇందులో పలు విభాగాల్లో వివిధ రకాలు ఉద్యోగాలున్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్–08, జనరల్ మేనేజర్–03, చీఫ్ మేనేజర్–04, మేనేజర్–05, అసిస్టెంట్ మేనేజర్–09, ఆఫీసర్–36, డిప్యూటీ మేనేజర్–09 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఇంజనీరింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హెచ్‌ఆర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ, కంపెనీ సెక్రటేరియట్, కార్పొరేట్ కమ్యూనికేషన్, లా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సెక్రటేరియల్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్/ఎల్‌ఎల్‌బీ, సీఏ/సీఎంఏ/ఎంఏ/ఎంసీఏ/ఎంఎస్సీ, ఎంబీఏ/పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయస్సు: డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 48 ఏళ్లు, జనరల్ మేనేజర్ పోస్టుకు 52 ఏళ్లు, చీఫ్ మేనేజర్ పోస్టుకు 45 ఏళ్లు, మేనేజర్‌కు 42 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 35 ఏళ్లు, ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 39 ఏళ్ల వయస్సు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్,ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేది: 2024 డిసెంబర్ 31
అఫీషియల్ వెబ్ సైట్: https://recindia.nic.in