Prabhas : ప్రస్తుతం సెలబ్రిటీలు అందరూ వెకేషన్ మోడ్ లో ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సినిమాలకి చిన్న బ్రేక్ అంటూ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ఎగిరిపోతున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఎయిర్ పోర్ట్ ల బాట పట్టారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి, విదేశాలకు వెళ్లిపోయారని తెలుస్తోంది. మరి ప్రభాస్ ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఎక్కడ జరుపుకోబోతున్నారు? అంటే…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన హీరోగా నటిస్తున్న’ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు ఆయన హీరోగా నటిస్తున్న నెక్స్ట్ మూవీ షూటింగ్ షురూ అయింది. దీనికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇంత బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమాలు అన్నింటినీ పక్కన పెట్టి, న్యూ ఇయర్ వెకేషన్ ను ఎంజాయ్ చేయబోతున్నారు.
క్షణం తీరిక లేకుండా ఉన్న షూటింగ్ లైఫ్ నీ పక్కన పెట్టేసి, ప్రభాస్ ఇప్పటికే విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రభాస్ ఇటలీ చేరుకున్నారని సమాచారం. అంటే ప్రభాస్ తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఇటలీలోనే జరుపుకోబోతున్నారు అన్నమాట. ఇక ఇప్పుడిప్పుడే సెలబ్రిటీలు అందరూ తమ ఫ్యామిలీలతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్లాన్స్ మొదలు పెట్టారు. చాలామంది స్టార్ కపుల్ ఇప్పటికే విదేశాలకు బయలుదేరారు. నిజానికి ఇక్కడ స్టార్స్ కు ఉన్న ఫాలోయింగ్, ఫ్యాన్స్ వల్ల వాళ్ళు బయట ఎక్కడా ప్రశాంతంగా తిరగలేరు, గడపలేరు. పొరపాటున ఎక్కడన్నా కనబడినా… వెంటనే అభిమానులు సెల్ఫీలు, ఫోటోలు అంటూ ఎగబడతారు. అందులే సినీ ప్రముఖులు చాలామంది విదేశాల్లో వెకేషన్లు ప్లాన్ చేస్తారు.
ఇదిలా ఉండగా… ఈ వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ‘ది రాజాసాబ్’ (The Raja Saab), ప్రభాస్ – హను రాఘవపూడి సినిమాల నెక్స్ట్ షెడ్యూల్స్ లో జాయిన్ కాబోతున్నారు. అయితే సంక్రాంతి తర్వాతే ప్రభాస్ సినిమా షూటింగ్ లు మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని ఇప్పటి దాకా ప్రచారం జరిగింది. కానీ మేకర్స్ మాత్రం ఏప్రిల్ 10 న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ వాయిదా పడబోతోందని అంటున్నారు. మరోవైపు ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ స్టార్ట్ కావాలంటే మరింత టైం పట్టే ఛాన్స్ ఉంది. 2025 సమ్మర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా మూవీ ‘స్పిరిట్’ (Spirit) సెట్స్ లో ప్రభాస్ జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.